Covid19 : నిన్నటి దాకా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ మొదలవుతున్నాయి. తాజాగా 24 గంటల్లో 5,357 కొత్తగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఇన్ఫెక్షన్ లలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 0.07 శాతం ఉండగా జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.74 శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలతో మొత్తం దేశంలో చని పోయిన వారి సంఖ్య ఇప్పటి వరకు 5,30,965కి పెరిగింది.
ప్రస్తుతం కరోనా కేసుల(Covid19) సంఖ్య 32,814 కి పెరిగినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. గుజరాత్ లో ముగ్గురు, హిమాచల్ ప్రదేశ్ లో ఇద్దరు, బీహార్ , ఛత్తీస్ గఢ్ , మహారాష్ట్ర , ఒడిశా, ఉత్తర ప్రదేశ్ ల నుంచి ఒక్కొక్కరు చొప్పున మరణాలు నమోదయ్యాయి. కేరళలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 4.47 కోట్లుగా నమోదైంది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటి వరకు దేశంలో 220.66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు అందజేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కేరళ, హర్యానా, పుదుచ్చేరి రాష్ట్రాలలో ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని స్పష్టం చేశాయి. ఈ మేరకు కోవిడ్ మార్గదర్శకాలు జారీ చేశాయి.
Also Read : కరోనా కేసులతో పరేషాన్