Revanth Reddy KTR : కేటీఆర్ లీగల్ నోటీసుల‌పై రేవంత్ ఫైర్

స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన టీపీసీసీ చీఫ్

Revanth Reddy KTR :  రాష్ట్రంలో పేప‌ర్ లీకేజీల వ్య‌వ‌హారం ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య నిప్పులు రాజేసింది. ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటూ మ‌రింత ర‌క్తి క‌ట్టిస్తున్నారు. కానీ ఇప్ప‌టి దాకా టీఎస్పీఎస్సీ పై విచార‌ణ చేప‌ట్టిన సిట్ కానీ మ‌నీ లాండ‌రింగ్ చోటు చేసుకుంద‌నే ఆరోప‌ణ‌ల‌తో ద‌ర్యాప్తు చేస్తున్న ఈడీ కానీ వివ‌రాలు వెల్ల‌డించ‌లేదు. అయితే నిరాధార ఆరోప‌ణ‌లు చేశారంటూ బండి సంజ‌య్ , రేవంత్ రెడ్డిల‌కు మంత్రి కేటీఆర్ లీగ‌ల్ నోటీసులు పంపించారు. ఆపై రూ. 100 కోట్ల ప‌రువు న‌ష్టం వేశారు. దీనికి సంబంధించి స‌మాధానం ఇవ్వ‌క పోతే బాగుండంద‌టూ పేర్కొన్నారు.

కేటీఆర్ ఇచ్చిన నోటీసుల‌పై ఘాటుగా స్పందించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy KTR) . ఇదిలా ఉండ‌గా ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ లో చోటు చేసుకున్న లీక్ వెనుక మంత్రి కేటీఆర్ పీఏ తిరుప‌తి హ‌స్తం ఉందంటూ సంచ‌ల‌న ఆరోణ‌లు చేశారు రేవంత్ రెడ్డి. ఇదంతా త‌ప్ప‌ని ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌ల‌న్నీ అవాస్త‌వాలేనంటూ పేర్కొన్నారు కేటీఆర్. క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని లేక పోతే రూ. 100 కోట్లు క‌ట్టాల‌ని హెచ్చ‌రించారు.

ఈ సంద‌ర్బంగా కేటీఆర్ ఇచ్చిన లీగ‌ల్ నోటీసుల‌కు స్పందించారు రేవంత్ రెడ్డి. 15 పేజీల సమాధానం కూడా ఇచ్చాచ‌రు. ఇదంతా ఐటీ శాఖ‌కు సంబంధించ‌న‌దేన‌ని , ద‌మ్ముంటే పేప‌ర్ లీక్ కేసును సీబీఐ, ఈడీకి అప్ప‌గించాల‌ని స‌వాల్ విసిరారు రేవంత్ రెడ్డి.

Also Read : సోము..న‌ల్లారి బిజీ బిజీ

Leave A Reply

Your Email Id will not be published!