Covid19 Cases : కరోనా కలకలం అంతటా అప్రమత్తం
దేశంలో పెరుగుతున్న కేసుల సంఖ్య
Covid19 Cases : నిన్నటి దాకా ప్రశాంతంగా ఉన్న కరోనా భూతం ఉన్నట్టుండి మరోసారి పడగ విప్పింది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆయా రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. ఈమేరకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది కేంద్రం.
Covid19 Cases Viral
తొలుత కేరళలో ప్రారంభమైంది. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా పలు చోట్ల కేసుల తాకిడి అంతకంతకూ పెరుగుతోంది. అంతటా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. కరోనా(Covid19) దెబ్బకు కొందరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ఆస్పత్రి పాలయ్యారు.
ప్రస్తుతం కరోనా విజృంభిస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది. తగు సూచనలు పాటించాలని కోరింది. ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా ఏకంగా కేసుల సంఖ్య పెరిగింది. 752 కేసులు నమోదు కావడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది కేంద్రం. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3 వేల 420 మందికి చేరుకుంది.
కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా పుదుచ్చేరి, పంజాబ్ , తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ , గుజరాత్ , గోవా, న్యూఢిల్లీ, కేరళ, మహారాష్ట్రలలో నమోదు కావడం విశేషం.
Also Read : TS Ration Cards : రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్