Covid19 : 4 వేలు దాటిన క‌రోనా కేసులు

ఆగ‌ని కేసులు త‌ప్ప‌ని తిప్ప‌లు

Covid19 : న్యూఢిల్లీ – దేశంలో క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. కేంద్ర స‌ర్కార్ అప్ర‌మ‌త్త‌మైంది. ఇప్ప‌టికే ఆయా రాష్ట్రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఎక్కువ‌గా కేర‌ళ‌లో న‌మోదు కావ‌డం విశేషం. దేశ వ్యాప్తంగా క‌రోనా కేసుల తీవ్ర‌త ఊపందుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 4 వేల‌కు పైగా యాక్టివ్ కేసులు న‌మోద‌య్యాయి.

Covid19 Updates

క‌రోనా రోజు రోజుకు విస్త‌రిస్తుండ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. క‌రోనాకు(Covid19) సంబంధించి ఉప వేరియంట్ జేఎన్ 1 ఊపందుకుంది. కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇదిలా ఉండ‌గా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల సంఖ్య 4,054 కు చేరుకుంది.

క‌రోనా కార‌ణంగా గ‌త 24 గంట‌ల్లో ఒక‌రు కేర‌ళ‌ల‌లో ప్రాణాలు కోల్పోయారు. ఇక క‌రోనా వేరియంట్ కారణంగా ప్ర‌భావిత‌మైన కేసులు అత్య‌ధికంగా కేర‌ళ‌లో 128 న‌మోద‌య్యాయి. ఇదిలా ఉండ‌గా దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 5,33,334 మంది మృతి చెందారు. అయితే 315 మంది క‌రోనా బారిన ప‌డి కోలుకున్నార‌ని మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టి దాకా కోలుకున్న వారి సంఖ్య 4,44,71,800 మందికి చేరుకుంది.

Also Read : Telangana Ministers : 29న మేడిగ‌డ్డ బ్యారేజ్ ప‌రిశీల‌న

Leave A Reply

Your Email Id will not be published!