CP CV Anand : పోలీస్ స్టేషన్ లో సివిల్ పంచాయతీలు చేసిన అధికారులకు సీపీ వార్నింగ్

తమ పద్ధతి మార్చుకోవాలని సీపీ వార్నింగ్‌ ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది...

CP CV Anand : పోలీస్‌ స్టేషన్‌లలో సివిల్‌ పంచాయతీలు చేసినా.. కాసుల కోసం కేసులను పక్కదారిపట్టించి సెటిల్‌మెంట్లకు పాల్పడినా సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటానని సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌(CP CV Anand) హెచ్చరించినట్లు తెలిసింది. కమిషనరేట్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ స్థాయి నుంచి ఏసీపీల వరకు ప్రతి అధికారిపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. ఇటీవల విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొడమే కాకుండా మహిళా పోలీసులపట్ల అసభ్యంగా మాట్లాడిన బోరబండ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌హెచ్‌వో, డీఐ)లపై బదిలీ వేటు వేశారు. ఒకరిని ట్రాఫిక్‌ విభాగానికి, మరొకరిని మరో పోలీస్‌ స్టేషన్‌ డీఐగా బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

CP CV Anand Comment

అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బంది జాబితా తన వద్దకు వచ్చిందని, అంతర్గత విచారణ అనంతరం తప్పకుండా చర్యలు ఉంటాయని సీపీ ఆనంద్‌(CP CV Anand) హెచ్చరించినట్లు సమాచారం. కాసుల వేటలో పడుతున్న కొంతమంది ఇన్‌స్పెక్టర్‌లు, ఎస్సైలు కేసులను పక్కదోవ పట్టించి ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తునట్లు తన దృష్టికి వచ్చిందని, అలాంటి వారిని విధుల నుంచి తప్పించడమే కాకుండా అప్రధాన్యత విభాగాలకు బదిలీ చేస్తామని హెచ్చరించినట్లు తెలిసింది. డివిజన్‌ స్థాయిలో పనిచేస్తున్న ఏసీపీలు.. తమ పద్ధతి మార్చుకోవాలని సీపీ వార్నింగ్‌ ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. డివిజన్‌ పరిధిలోని స్టేషన్‌లపై దృష్టి సారించి, పాలనను గాడిన పెట్టాల్సిన ఏసీపీలు అక్రమాలకు పాల్పడుతూ.. అరాచకం సృష్టిస్తున్నారని మండిపడినట్లు సమాచారం.

త్వరలోనే అన్ని పోలీస్‌ స్టేషన్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బందిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటా. గాడితప్పిన స్టేషన్‌లపై ప్రత్యేక దృష్టి సారించి ప్రక్షాళనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాను. ఇటీవల అవినీతి ఆరోపణలు వచ్చిన సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకున్నాం. ఒక్క నెలలోనే ఏసీపీ, ఐదుగురు ఇన్‌స్పెక్టర్‌లు, హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకున్నాము. ఇంకా కొంతమందిపై అంతర్గత విచారణ జరుగుతుంది. త్వరలోనే స్టేషన్‌ల ప్రక్షాళనలో భాగంగా వారిపైనా చర్యలు తీసుకుంటా. అవినీతికి పాల్పడే సిబ్బంది ఎంతటివారైనా చర్యలు తప్పవు.

Also Read : CM Chandrababu : నేడు చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు లో సీఎం చంద్రబాబు పర్యటన

Leave A Reply

Your Email Id will not be published!