CPI Narayana : హైదరాబాద్ – సీపీఐ కార్యదర్శి నారాయణ(CPI Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి బిగ్ బాస్ పై సీరియస్ కామెంట్స్ చేశారు. ఆనాడు బిగ్ బాస్ పై తాను చేసిన కామెంట్స్ కు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. అది ఒక రకంగా చెప్పాలంటే బిగ్ బాస్ అనేది ఓ బ్రోతల్ హౌస్ అని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు నారాయణ.
CPI Narayana Serious Comments on Big Boss
నేను ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయనని స్పష్టం చేశారు. ఉద్దేశ పూర్వకంగా విమర్శలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. తాను ఏది కరెక్ట్ అయితే దాని గురించి స్పష్టం చేస్తానని పేర్కొన్నారు నారాయణ.
బిగ్ బాస్ అనైతికంగా అనిపించిందని అన్నారు. అందుకే విమర్శించానని చెప్పారు. ఏ సంబంధం లేని 50 మంది ఒకే ఇంట్లో ఉండటాన్ని బ్రోతల్ హౌస్ అనక ఏమంటారంటూ ప్రశ్నించారు సీపీఐ కార్యదర్శి. మరో వైపు సీపీఎం పార్టీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఒకే జెండాగా ఉందామని నేను మొదటి నుంచీ చెబుతూ వచ్చానని స్పష్టం చేశారు. కానీ సీపీఎం అందుకు ఒప్పుకోవడం లేదన్నారు. దీని వల్ల ప్రజల్లో అయోమయం ఏర్పడుతుందన్నారు. భావ సారూప్యత కలిగిన పార్టీలో కలిస్తే తప్పేంటి అని ఎదురు ప్రశ్న వేశారు నారాయణ.
Also Read : IT Raids : వివేక్ కు షాక్ ఐటీ రైడ్స్