Kapil Dev : భారత దేశం గర్వించ దగిన యోధాను యోధుడు కపిల్ దేవ్ (Kapil Dev )నిఖంజ్. ఇవాళ ఆయన పుట్టిన రోజు. సరిగ్గా తన సారథ్యంలో 1983లో మొట్ట మొదటిసారిగా భారత క్రికెట్ జట్టుకు వరల్డ్ కప్ తీసుకు వచ్చిన ఘనత ఆయనదే.
కపిల్ దేవ సారథ్యంలోనే ఈ అరుదైన, అద్భుతమైన, చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన ప్లేయర్.
బౌలర్, బ్యాటర్ , ఫీల్డర్, కెప్టెన్ మొత్తంగా ఆల్ రౌండర్. మొత్తం 131 టెస్టులు ఆడి 5 వేల 248 పరుగులు చేశాడు.
163 పరుగులు చేశాడు. 4 వేల 623 ఒవర్లు వేశాడు. 434 వికెట్లు పడగొట్టాడు. ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 23 సార్లు పడగొట్టాడు. ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు రెండుసార్లు తీశాడు. అత్యుత్తమ బౌలింగ్ 83 పరుగులు ఇచ్చి 9 వికెట్లు కూల్చాడు.
64 క్యాచ్ లు పట్టాడు. ఇక వన్డే మ్యాచ్ ల పరంగా చూస్తే 225 మ్యాచ్ లు ఆడాడు. 3 వేల 783 పరుగులు చేశాడు. అత్యుత్తమ పరుగులు 175 చేశాడు. 1867 ఓవర్లు వేశాడు. 253 వికెట్లు కూల్చాడు.
బౌలింగ్ సగటు 27. 45 గా ఉంది. 5 వికెట్లు ఒకసారి పడగొట్టాడు. అత్యుత్తమ బౌలంగ్ పరంగా చూస్తే 43 పరుగులకు 5 వికెట్లు పడగొట్టారు. 71 క్యాచ్ లు పట్టుకున్నాడు. 2008లో క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు కపిల్ దేవ్(Kapil Dev ).
1959 జనవరి 6న హర్యానాలోని ఛండీగఢ్ లో పుట్టాడు. భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలందు అందించాడు. ప్రపంచం లోనే అత్యున్నత ఆల్ రౌండర్లలో ఒకడిగా పేరొందాడు.
2002లో విజ్డన్ పత్రికతో 20వ శతాబ్దపు మేటి భారతీయ క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. 1999 అక్టోబర్ నుంచి 2000 ఆగస్టు దాకా 10 నెలల పాటు భారత జట్టు కోచ్ గా వ్యవహరించాడు కపిల్ దేవ్.
1980 కాలంలో ఇన్ స్వింగ్ యార్కర్ బౌలింగ్ తో దుమ్ము రేపాడు. ఆయనకు ముద్దు పేరు హర్యానా కరేన్. కపిల్ దేవ్ కు అర్జున, పద్మశ్రీ, పద్మవిభూషణ్ పురస్కారాలు పొందాడు.
2013లో కల్నల్ సీకే నాయకుడు జీవిత సాఫల్య అవార్డు అందుకున్నాడు. ఆనాటి తన సారథ్యంలో తీసుకు వచ్చిన వరల్డ్ కప్ జ్ఞాపకాలతో కూడిన వరల్డ్ కప్ కు సంబంధించి 83 మూవీ రిలీజ్ అయి భారీ ఆదరణ పొందుతోంది.
Also Read : భారత సినీ వాలిలో కదిలే తార