Ajinkya Rahane BMW Car : బీఎండ‌బ్ల్యూ కారు కొన్న ర‌హానే

గాయం కార‌ణంగా త‌ప్పుకున్న క్రికెట‌ర్

Ajinkya Rahane BMW Car : భార‌త స్టార్ ప్లేయ‌ర్ గా పేరొందిన అజింక్యా ర‌హానే వార్త‌ల్లో నిలిచాడు. ఐపీఎల్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ త‌ర‌పున ఆడాడు. ఆ జ‌ట్టు ప్లే ఆఫ్స్ కు చేర‌లేదు.

ఇదిలా ఉండ‌గా గాయం కార‌ణంగా త‌ప్పుకున్నాడు ర‌హానే. తాజాగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది ఇష్ట‌ప‌డే బిఎండ‌బ్ల్యూ 6 సీరీస్ వాహ‌నాన్ని కొనుగోలు చేశాడు.

శుక్ర‌వారం ఆయ‌న‌కు కంపెనీ డెలివ‌రీ చేసింది. కారుకు సంబంధించిన తాళాన్ని అజింక్యా ర‌హానేకు(Ajinkya Rahane BMW Car) అంద‌జేశారు. దీని ధ‌ర సుమారు రూ. 69.90 ల‌క్ష‌లు. ఇది ఎక్స్ షో రూమ్ ధ‌ర. బీఎండ‌బ్ల్యూ 6 సీరీస్ జీటిని 630ఐ ఎం స్పోర్ట్స్ వేరియంట్ లో ఉంది ఈ కారు.

ఇక భార‌త క్రికెట‌ర్ల ఆదాయం గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. కోట్ల‌ల్లో ఆదాయం ఉంటోంది. ఒక్కో ఆట‌గాడికి ఒక్కో పిచ్చి. కొంద‌రు వాహ‌నాలు ఇష్ట‌ప‌డితే. మ‌రికొంద‌రు ఖ‌రీదైన వాచీలు, ఆభ‌ర‌ణాలు, ఇత‌ర దేశాల‌లో ప‌ర్య‌టించ‌డం చేస్తూ వ‌స్తారు.

ఇక అజింక్యా ర‌హానేకు మిస్ట‌ర్ కూల్ అన్న పేరుంది. భార‌త జ‌ట్టుకు కోహ్లీ స్థానంలో ఆస్ట్రేలియాలో నాయ‌క‌త్వం వ‌హించాడు. భార‌త్ కు అద్భుత విజ‌యాన్ని అందించాడు.

ఆ త‌ర్వాత పేల‌వ‌మైన ఫామ్ తో జ‌ట్టులో స్థానం కోల్పోయాడు. ఇదిలా ఉండ‌గా 187 బీహెచ్ పి. 2.0 లీట‌ర‌ర్ ట‌ర్బో పెట్రోల్ ఇంజ‌న్ క‌లిగి ఉంది ఈ బీఎండ‌బ్ల్యూ వాహ‌నం.

ఈ మోడ‌ల్ వాహ‌న త‌యారీదారుల లైన‌ప్ లోని 5 సీరీస్ ల కంటే రెండో వ‌రుస‌లో మెరుగైన సౌక‌ర్యాన్ని అందిస్తుంది. ఈ కారు క‌ల‌ర్ పూర్తిగా వైట్ క‌ల‌ర్ లో ఉంది.

దీని గ‌రిష్ట వేగం 250 కిలోమీట‌ర్లుగా ఉంది. ఈ బీఎండ‌బ్ల్యూ రెండు వెర్ష‌న్ ల‌లో ఉంది. డీజిల్, పెట్రోల్ ద్వారా న‌డిపేందుకు వీలుంది.

Also Read : ఐపీఎల్ వ‌ల్ల సంప‌న్నుల‌కు లాభం

Leave A Reply

Your Email Id will not be published!