Arun dhumal : దాదా పనితీరుపై విమర్శలు సరికాదు – ధుమాల్
సౌరవ్ గంగూలీ అద్బతంగా పని చేశారు
Arun dhumal : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బాస్ గా సౌరవ్ గంగూలీ పనితీరు సక్రమంగా లేదంటూ కొందరు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారంటూ వచ్చిన వార్తలు వాస్తవం కాదన్నారు అరుణ్ ధుమాల్(Arun dhumal). బీసీసీఐ బాస్ గా దాదా కథ ముగిసింది. కాగా న్యూఢిల్లీలో జరిగిన బీసీసీఐ బోర్డు మీటింగ్ లో సభ్యులు సౌరవ్ గంగూలీ మూడేళ్ల పదవీ కాలంలో ఆయన పనితీరును ప్రశ్నించినట్లు సమాచారం.
కొంత మంది సభ్యులు గంగూలీకి వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు కూడా నివేదికలు ఉన్నాయి. మరోసారి బీసీసీఐ బాస్ గా ఉండేందుకు సన్నద్దంగానే ఉన్నాడు. కొందరు సభ్యులు అభ్యంతరం తెలపడంతో తను తప్పుకున్నాడు అనూహ్యంగా. ప్రస్తుతం కోశాధికారిగా ఉన్న అరుణ్ ధుమాల్ దీనిపై ప్రత్యేకంగా స్పందించారు.
ఇందుకు సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. బీసీసీఐ కార్యవర్గానికి సంబంధించి ఇప్పటికే నామినేషన్లు దాఖలయ్యాయి. రోజర్ బిన్నీ తదుపరి బాస్ గా ఉంటారు. జే షా కార్యద్శిగా , రాజీవ్ శుక్లా ఉపాధ్యక్షుడిగా ఉంటారు. స్వతంత్ర భారత దేశంలో మూడేళ్లకు పైగా పని చేసిన బీసీసీఐ అధ్యక్షుడు ఎవరూ లేరన్నారు అరుణ్ ధుమాల్.
దాదా గురించి మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని పేర్కొన్నాడు. గంగూలీకి వ్యతిరేకంగా ఎవరూ ఒక్క మాట మాట్లాడలేదు. మొత్తం జట్టులో సభ్యులంతా సంతోషంగా ఉన్నారని తెలిపాడు. ఒకవేళ గంగూలీ ఓకే చేసి ఉంటే తాను ఐపీఎల్ చైర్మన్ కాబోయే వాడిని కానని స్పష్టం చేశాడు.
Also Read : టి20 వరల్డ్ కప్ లో నమీబియా సెన్సేషన్