CJI NV Ramana : క‌ర్త‌వ్య నిర్వ‌హ‌ణ‌లో ల‌క్ష్మ‌ణ రేఖ దాటొద్దు

సీజేఐ నూత‌ల‌పాటి వెంక‌ట ర‌మ‌ణ కామెంట్స్ 

CJI NV Ramana  : భార‌త దేశ స‌ర్వోన‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట ర‌మ‌ణ (CJI NV Ramana )సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌ధానంగా ఎవ‌రికి వారు స్వీయ నియంత్ర‌ణ పాటించాల‌ని, ఆయా సాధికార‌త క‌లిగిన అత్యున్న‌త  సంస్థ‌ల మ‌ధ్య ల‌క్ష్మ‌ణ రేఖ ఒక‌టి ఉంద‌ని గుర్తుంచు కోవాల‌ని సున్నితంగా హెచ్చ‌రించారు.

శ‌నివారం దేశంలోని ముఖ్య‌మంత్రులు, హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తుల‌తో జ‌రిగిన సద‌స్సులో జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ(CJI NV Ramana )ల‌క్ష్మ‌ణ‌రేఖ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

న్యాయ‌మైన తీర్పులు ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వాలు ఉద్దేశ పూర్వ‌కంగా , నిష్క్రియాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం ప్ర‌జాస్వామ్యానికి  మంచిది కాద‌ని ఆయ‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

భార‌త రాజ్యాంగం మూడు సంస్థ‌ల మ‌ధ్య అధికార విభ‌జ‌న క‌ల్పించింద‌ని, త‌మ విధిని నిర్వ‌హించే స‌మ‌యంలో త‌మ ప‌రిమితులు ఏమిట‌నే దానిపై ఫోక‌స్ పెట్టాల‌ని భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్వీ ర‌మ‌ణ స్ప‌ష్టం చేశారు.

ఆయా సంస్థ‌ల మ‌ధ్య సామ‌ర‌స్య పూర్వ‌క ప‌నితీరు ప్ర‌జాస్వామ్యాన్ని మ‌రింత బ‌లోపేతం అయ్యేలా చేస్తుంద‌న్నారు. మ‌న క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌ర్తిస్తున్న‌ప్పుడు మ‌నం ల‌క్ష్మ‌ణ రేఖ ఒక‌టి ఉంద‌న్న విష‌యాన్ని ప్ర‌ధానంగా గుర్తు పెట్టుకోవాల‌ని సూచించారు.

ఇదిలా ఉండ‌గా  దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సీఎంలు, హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ ల స‌ద‌స్సును ప్రారంభించారు.ఈ స‌ద‌స్సుకు ఎన్వీ ర‌మ‌ణ  ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు.

ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యాల (పీఐఎల్ ) దుర్వినియోగంపై ఎన్వీ ర‌మ‌ణ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వ్య‌క్తిగ‌త ఆస‌క్తి వ్యాజ్యంగా మారాయ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

Leave A Reply

Your Email Id will not be published!