CSK Women IPL 2023 : మ‌హిళ‌ల ఐపీఎల్ పై సీఎస్కే ఫోక‌స్

జ‌ట్టును కొనుగోలు చేస్తామ‌న్న సిఇఓ

CSK Women IPL 2023 : పురుషుల ఐపీఎల్ లో ఇప్ప‌టికే నాలుగుసార్లు ఛాంపియ‌న్ షిప్ గా గెలుపొందింది చెన్నై సూప‌ర్ కింగ్స్. ఇప్ప‌టికే ఐపీఎల్ 2023కి సంబంధించి కేర‌ళ‌లోని కొచ్చిలో మినీ వేలం పాట ముగిసింది. త్వ‌ర‌లోనే రిచ్ లీగ్ ప్రారంభం కానుంది. తాజాగా భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మ‌హిళ‌ల‌కు సంబంధించి ఐపీఎల్ ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది.

ఇప్ప‌టికే మార్గ‌ద‌ర్శ‌కాలు కూడా రూపొందించింది. త్వ‌ర‌లోనే మహిళ‌ల జ‌ట్ల‌ను స్వంతం చేసుకునేందుకు బిడ్స్ కోసం పిల‌వ‌నుంది. ఇప్ప‌టికే ముంబై ఇండియ‌న్స్ , రాజస్థాన్ రాయ‌ల్స్ , పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ , ఢిల్లీ క్యాపిట‌ల్స్ , స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో పాటు ఇత‌ర ఫ్రాంచైజీలు ఫోక‌స్ పెట్టాయి.

తాజాగా చెన్నై సూప‌ర్ కింగ్స్ యాజ‌మాన్యం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు తాము కూడా మ‌హిళ‌ల కు(CSK Women IPL 2023) సంబంధించి జ‌ట్టును టేకోవ‌ర్ చేసుకునేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు సీఎస్కే సిఇఓ .ఇప్ప‌టికే విమెన్స్ డ‌బ్ల్యూ ఐపీఎల్ బీసీసీఐ బిడ్ల‌ను ఆహ్వానించింది.

త‌మ ఫ్రాంచైజీ త‌ర‌పున బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వ‌ర‌ల్డ్ పాపుల‌ర్ జ‌ట్టుకు సంబంధించి విమెన్స్ టీం లేక పోతే ఎలా. అందుకే కొనుగోలు చేసేందుకు రెడీగా ఉన్నామ‌ని పేర్కొన్నారు. ఇక బిడ్స్ లో పాల్గొనేందుకు జ‌న‌వ‌రి 21 వ‌ర‌కు డెడ్ లైన్ విధించింది. ఇందుకు గాను రూ. 5 ల‌క్ష‌లు నాన్ రిఫండ‌బుల్ చెల్లించాల్సి ఉంటుంది.

మార్చి 4 నుంచి 26 వ‌ర‌కు విమెన్ ఐపీఎల్ చేప‌ట్టేందుకు నిర్ణ‌యించింది. కొత్త‌గా చేప‌ట్టే విమెన్ ఐపీఎల్ లో ఐదు జ‌ట్లు పాల్గొననున్నాయి.

Also Read : మ‌హిళ‌ల ఐపీఎల్ పై ఫ్రాంచైజీల న‌జ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!