CSK Retention List : అంబ‌టి..జ‌డేజాకు క‌లిసొచ్చిన అదృష్టం

కొన‌సాగించిన చెన్నై సూప‌ర్ కింగ్స్

CSK Retention List : భార‌త క్రికెట్ జ‌ట్టుకు అత్యధికంగా విజ‌యాలు సాధించి పెట్టిన కెప్టెన్ గా మ‌హేంద్ర సింగ్ ధోనీకి పేరుంది. అతడి సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ టీమ్ మ‌రోసారి వ‌చ్చే ఏడాది 2023లో జ‌రిగే ఐపీఎల్ లో దిగ‌నుంది. ఈ ఏడాది జ‌రిగిన ఐపీఎల్ లో కెప్టెన్ గా త‌ప్పుకున్నాడు.

అంత‌లోపు ర‌వీంద్ర జ‌డేజాకు అప్ప‌గించాడు. కానీ జ‌ట్టును న‌డ‌ప‌లేక పోయాడు. చివ‌ర‌కు చేతులెత్తేయ‌డంతో మ‌ళ్లీ మ‌హేంద్ర సింగ్ ధోనీకే ప‌గ్గాలు అప్ప‌గించింది సీఎస్కే. మ‌రో వైపు భార‌త క్రికెట్ జ‌ట్టుకు సంబంధించి మ‌రో ప్ర‌చారం జ‌రుగుతోంది. టి20 ఫార్మాట్ కు సంబంధించి ఎంఎస్ ధోనీని డైరెక్ట‌ర్ గా ఎంపిక చేయాల‌ని బిసీసీఐ ఆలోచిస్తోంద‌ని టాక్.

ఇది ప‌క్క‌న పెడితే త‌క్కువ ఖ‌ర్చుతో ఆట‌గాళ్ల‌ను తీసుకునే అల‌వాటు ధోనీకి ఉంది. మొద‌టి నుంచి దానిని ఫాలో చేస్తూ వ‌స్తున్నాడు. ఇక తాజాగా బీసీసీఐ ఐపీఎల్ కు త‌మ తుది జాబితాను అంద‌జేసింది చెన్నై సూప‌ర్ కింగ్స్(CSK Retention List) ఫ్రాంచైజ్.

ఎప్ప‌టి లాగే ధోనీ సీఎస్కేకు సార‌థిగా ఉండ‌నున్నాడు. అత‌డితో పాటు డెవాన్ కాన్వే , రుతురాజ్ గైక్వాడ్ , అంబ‌టి రాయుడు, సుభ్రాంశు సేనాప‌తి, మొయిన్ అలీ, శివ‌మ్ దూబే , రాజ్ వ‌ర్ద‌న్ హంగ్ రేక‌ర్ , డ్వైన్ ప్రిటోరియ‌స్ , మిచెల్ సాంట్న‌ర్ , ర‌వీంద్ర జ‌డేజా, తుషార్ దేశ్ పాండే, ముఖేష్ చౌద‌రి, సింఘ్ ద‌ర్ , దీప‌క్ చాహ‌ర్ , ప్ర‌శాంత్ సోలంకి, మ‌హేశ్ తీక్ష‌ణ‌ల‌ను రిటైన్ చేసుకుంది.

ఇక బ్రావో, ఊత‌ప్ప‌, ఆడ‌మ్ మిల్నే, హ‌రి నిశాంత్ , క్రిస్ జోర్డాన్ , భ‌గత్ వ‌ర్మ‌, కేఎం ఆసిఫ్ , నారాయ‌ణ్ జ‌గ‌దీశ‌న్ ను విడుద‌ల చేసింది.

Also Read : ఈసారైనా ల‌క్నోకు ల‌క్ క‌లిసొస్తుందా

Leave A Reply

Your Email Id will not be published!