MS Dhoni : మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డ్
ఐపీఎల్ లో 5 వేల రన్స్
MS Dhoni : మిస్టర్ కూల్ గా పేరు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ స్కిప్పర్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డ్ సాధించాడు. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్)లో జరిగిన రెండో లీగ్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై సీఎస్కే 12 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది.
మ్యాచ్ లో భాగంగా ఆఖరి 20వ ఓవర్ లో బ్యాటింగ్ కు దిగిన మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) వరుస సిక్సర్లతో చెలరేగాడు. దీంతో వ్యక్తిగతంగా టోర్నీలో 5,000 పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
టోర్నీలో 5 వేల రన్స్ కు పైగా చేసిన ఆటగాళ్లలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఏడో క్రికెటర్. మార్క్ వుడ్ బౌలింగ్ లో రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. మూడు ఏళ్ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మొదటి మ్యాచ్ ఆడింది.
ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో భారత క్రికెట్ జట్టు మాజీ స్కిప్పర్ విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ , డేవిడ్ వార్నర్ , రోహిత్ శర్మ, సురేష్ రైనా, ఎబి డివిలియర్స్ ఉన్నారు. వీరి సరసన తాజాగా కెప్టెన్ ధోనీ చేరాడు.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు రుతురాజ్ గైక్వాడ్ , డెవాన్ కాన్వే , మొయిన్ లీ. బ్యాటింగ్ పరంగా గైక్వాడ్ , కాన్వే రెచ్చి పోతే అద్భుతమైన బౌలింగ్ తో లక్నోను కట్టడి చేశాడు మొయిన్ అలీ.
Also Read : రెచ్చి పోయిన కైల్ మేయర్స్