ఈ ఏడాది జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో భారత దేశానికి చెందిన మహిళా దర్శకురాలు కార్తికీ గొన్సాల్వేస్ తీసిన ది ఎలిఫెంట్ విష్పరర్స్ మూవీ అత్యుత్తమ డాక్యుమెంటరీ ఫిలిం గా ఆస్కార్ కు ఎంపికైంది. ఈ చిత్రంలో నటించిన తమిళనాడుకు చెందిన బొమ్మన్ – బెల్లీతో పాటు దర్శకురాలు కార్తీకీ గొన్సాల్వేస్ ను ఘనంగా సత్కరించింది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం.
ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా చెన్నై స్టేడియంలో టీమ్ కు జ్ఞాపికతో పాటు నగదు బహుమతిని కూడా అందజేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. వీరికి అద్భుతమైన కానుకను బహూకరించాడు చెన్నై సూపర్ కింగ్స్ స్కిప్పర్ మహేంద్ర సింగ్ ధోనీ. తాను ధరించే జెర్సీని బొమ్మన్ – బెల్లీ దంపతులకు ఇచ్చాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన సీఎస్కే మ్యాచ్ కు ముందు ఐపీఎల్ క్రికెట్ జట్టు యజమాని రూపా గురునాథ్ ఆ ముగ్గురిని మెమెంటోలో ఘనంగా సత్కరించారు. అంతే కాదు సీఎస్కే యాజమాన్యం ముదుబలై టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ కు కొంత నిధులను కూడా సమకూర్చనుంది. మా జట్టు క్రికెట్ తో అలరిస్తే మీరు కోట్లాది మంది ప్రజల హృదయాలనే కాదు కన్నీళ్లు తెప్పించేలా చేశారంటూ భావోద్వేగంతో పోస్ట్ చేసింది సీఎస్కే. వీరికి ఎంఎస్ ధోనీ నమస్కారం చేయడం పలువురిని ఆకట్టుకుంది.
