CSK vs GT Qualifier1 : గుజ‌రాత్ కు షాక్ చెన్నై ఫైన‌ల్ కు

ప్ర‌తీకారం తీర్చుకున్న ధోనీ సేన

CSK vs GT Qualifier1 : జార్ఖండ్ డైన‌మెంట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్(CSK) ఐపీఎల్ 16వ సీజ‌న్ లో ఫైన‌ల్ కు దూసుకు వెళ్లింది. చెన్నై వేదిక‌గా డిఫెండింగ్ ఛాంపియ‌న్ తో జరిగిన క్వాలిఫయ‌ర్ -1 లో చివ‌రి దాకా నువ్వా నేనా అన్న రీతిలో సాగింది. చివ‌ర‌కు 15 ప‌రుగుల తేడాతో గుజ‌రాత్ టైటాన్స్(GT) ను ఓడించి త‌న‌కు ఎదురే లేద‌ని చాటింది.

లీగ్ ఆరంభంలో త‌డ‌బ‌డినా పాయింట్ల ప‌ట్టిక‌లో 2వ స్థానంలో ఉన్న చెన్నై సూప‌ర్ కింగ్స్ మాత్రం ఈసారి మైదానంలో అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో ఫీల్డింగ్ లో స‌త్తా చాటింది. అన్ని విభాగాల‌లో త‌న‌దైన ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచింది. గుజ‌రాత్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 172 ర‌న్స్ చేసింది. 173 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో గుజ‌రాత్ టైటాన్స్ చేతులెత్తేసింది. 20 ఓవ‌ర్ల‌లో 157 ప‌రుగుల‌కు ఆలౌటైంది. చెన్నై బౌల‌ర్ల ధాటికి వికెట్లు ట‌పా ట‌పా రాలాయి. డాసున్ శ‌న‌క 17 ర‌న్స్ చేస్తే సాహా 12 , విజ‌య్ శంక‌ర్ 14, హార్దిక్ పాండ్యా 8 , డేవిడ్ మిల్ల‌ర్ 4, రాహుల్ తెవాటియా 3 ప‌రుగుల‌కే చాప చుట్టేశారు.

ఈ త‌రుణంలో ఆఫ్గ‌నిస్తాన్ స్టార్ ఆల్ రౌండ‌ర్ ర‌షీద్ ఖాన్ ఒక్క‌డే ఒంట‌రి పోరాటం చేశాడు. 16 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. 30 ప‌రుగులు చేశాడు. కానీ లాభం లేక పోయింది . దేశ్ పాండే వేసిన బంతికి బౌల్డ్ కావ‌డంతో చెన్నై గెలుపు బాట ప‌ట్టింది.

అంత‌కు ముందు చెన్నై బ్యాటింగ్ లో రుతురాజ్ గైక్వాడ్ దంచి కొట్టాడు. 44 బంతులు ఆడి 7 ఫోర్లు 1 సిక్స‌ర్ తో 60 రన్స్ చేశాడు. డేవాన్ కాన్వే 34 బంతుల్లో 4 ఫోర్ల‌తో 40 ర‌న్స్ చేశాడు. ర‌హానే 10 బంతుల్లో 17 ప‌రుగుల‌తో రాణించాడు. రాయుడు 9 బంతుల్లో 17 ర‌న్స్ చేశాడు.

Also Read : Ishitha Kishore Top

Leave A Reply

Your Email Id will not be published!