CSK vs KKR IPL 2023 : చెన్నై చంద్రమా కోల్ కతా రణమా
లీగ్ మ్యాచ్ కు ఇరు జట్లు రెఢీ
CSK vs KKR IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ లో ఆదివారం బలమైన జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి. రాత్రి 7.30 గంటలకు మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ తో నితీశ్ రాణా నాయకత్వంలోని కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. భారీ స్కోర్ చేసినా ఆర్సీబీని చిత్తు చేసింది చెన్నై. ఫుల్ జోష్ మీద ఉంది సీఎస్కే. ఈ తరుణంలో కోల్ కతా సైతం అన్నింటా బలంగా కనిపిస్తోంది. దీంతో ఇరు జట్ల మధ్య రసవత్తర పోరుకు సిద్దమయ్యాయి.
పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ 3వ స్థానంలో నిలిచింది. ఇప్పటి దాకా 6 మ్యాచ్ లు ఆడింది. నాలుగు మ్యాచ్ లలో గెలుపొందింది. 2 మ్యాచ్ లలో ఓటమి పాలైంది. ఇక కోల్ కతా నైట్ రైడర్స్(CSK vs KKR IPL 2023) జాబితాలో 8వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 6 మ్యాచ్ లు ఆడిన కోల్ కతా 2 మ్యాచ్ లలో మాత్రమే గెలిచింది. 4 మ్యాచ్ లలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ కోల్ కతాకు కీలకం కానుంది.
లీగ్ లో భాగంగా ఇది 33వ మ్యాచ్. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. హోం గ్రౌండ్ కావడంతో కోల్ కతా కు అదనపు బలం కానుంది. ఇక చివరి మ్యాచ్ లో సన్ రైజర్స్ కు షాక్ ఇచ్చింది చెన్నై. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివం దూబే ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇక కోల్ కతాలో నితీశ్ రాణా, రింకూ సింగ్ , తదితర ఆటగాళ్లు దంచి కొట్టేందుకు సిద్దమయ్యారు.
Also Read : అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్ మ్యాజిక్