CSK vs PBKS IPL 2023 : పంజాబ్ ప్రతాపం చెన్నై పరాజయం
ఉత్కంఠ భరిత పోరులో 4 వికెట్లతో గెలుపు
CSK vs PBKS IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా ఆదివారం జరిగిన రెండు కీలక మ్యాచ్ లు ఆద్యంతమూ ఉత్కంఠ భరితంగా సాగాయి. చివరి ఓవర్ దాకా నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగాయి. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది శిఖర్ ధావన్ సేన.
పంజాబ్ 4 వికెట్ల తేడాతో చెన్నై(CSK vs PBKS IPL 2023) పై థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 200 రన్స్ చేసింది. ఓపెనర్ డేవిడ్ కాన్వే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 52 బంతులు ఆడిన కాన్వే 16 ఫోర్లు ఒక భారీ సిక్స్ తో 92 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రుతురాజ్ గైక్వాడ్ 37 రన్స్ , శివమ్ దూబే 28 పరుగులతో రాణించారు. దీంతో చెపాక్ స్టేడియంలో పరుగులు ధారాళంగా వచ్చాయి.
అనంతరం 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 6 వికెట్లు కోల్పోయి 201 రన్స్ చేసింది. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 24 బంతులు ఆడి 42 రన్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. లివింగ్ స్టోన్ 24 బంతులు ఆడి 1 ఫోర్ 4 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. ఆఖరులో సికిందర్ రజా 13 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
Also Read : ప్రభ్ సిమ్రాన్ సింగ్ షాన్ దార్