Sharukh Khan : క‌మిన్స్ సెన్సేష‌న్ బాద్ షా డ్యాన్స్

ముంబై ఇండియ‌న్స్ పై రికార్డ్ బ్రేక్

Sharukh Khan  : ఐపీఎల్ 2022లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది ముంబై ఇండియ‌న్స్ పై. రోహిత్ సేన ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాడు ఆసిస్ స్టార్ హిట్ట‌ర్ పాట్ క‌మిన్స్ . ఊహించ‌ని రీతిలో దుమ్ము రేపాడు.

కేవ‌లం 14 బంతుల్లో క‌మిన్స్ హాఫ్ సెంచ‌రీ సాధించాడు. ఏకంగా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ న‌మోదు చేశాడు. దీంతో నాలుగు మ్యాచ్ లు ఆడిన కేకేఆర్ మూడు మ్యాచ్ లు గెలుపొందారు.

ఒక మ్యాచ్ లో ఓట‌మి పాలైంది. మ్యాచ్ ముగిశాక కేకేఆర్ టీంలో ఆనందం అంబరాన్ని ఇంటింది. ఈ త‌రుణంలో కేకేఆర్ ఓన‌ర్ గా ఉన్న ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు, బాద్ షా షారుఖ్ ఖాన్(Sharukh Khan )అంతులేని సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

పాట్ క‌మిన్స్ సెన్సేష‌న్ బ్యాటింగ్ త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుందని పేర్కొన్నాడు. అంతే కాదు జ‌ట్టును గెలిచిన ఆనందంలో డ్యాన్స్ చేశాడు. ప్ర‌స్తుతం షారుఖ్ ఖాన్ హాట్ టాపిక్ గా మారాడు.

ఆయ‌న‌కు సంబంధించిన ఫోటోలు, వీడియో సామాజిక మాధ్య‌మాల‌లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అద్బుత‌మైన పేస‌ర్ గా పేరొందాడు. అంతే కాదు సింహ స్వ‌ప్నంగా మారి పోయాడు.

అద్భుత‌మైన బ్యాట్ తో స‌త్తా చాటాడు. మిలియ‌న్ల మంది ప్ర‌జ‌ల హృద‌యాల‌ను గెలుచుకున్నాడు. క‌మిన్స్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మ‌రోసారి హాట్ టాపిక్ (Sharukh Khan )గా మారి పోయాడు.

తాజా, మాజీ ఆట‌గాళ్ల‌తో పాటు కోట్లాది మంది ఫ్యాన్స్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం బాద్ షా చేసిన డ్యాన్స్ వైర‌ల్ గా మారింది. విజ‌యం ఇచ్చే కిక్కు ఇంకేదీ ఇవ్వ‌ద‌ని షారుఖ్ ఖాన్ ను చూస్తే తెలుస్తుంది.

Also Read : భార‌త్ స‌హాయం జ‌య‌సూర్య సంతోషం

Leave A Reply

Your Email Id will not be published!