CV Anand : గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం – సీపీ

హైద‌రాబ‌ద్ పోలీస్ క‌మిష‌న‌ర్ ఆనంద్

CV Anand : హైద‌రాబాద్ – వినాయ‌క చ‌వితిని పుర‌స్క‌రించుకుని సెప్టెంబ‌ర్ 28న గ‌ణ‌నాథుల నిమ‌జ్జ‌నం జ‌ర‌గ‌నుంది. దీంతో హైద‌రాబాద్ లో ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఉండేందుకు భారీ ఎత్తున పోలీసుల‌ను మోహ‌రించారు. న‌గ‌ర‌మంతా జ‌ల్లెడ ప‌ట్టారు. ఎక్క‌డ చూసినా ఖాకీలే ద‌ర్శ‌నం ఇస్తున్నారు. గురువారం ఉద‌యం నుంచే వినాయ‌కుల నిమ‌జ్జ‌నం ప్రారంభం అవుతుంది.

CV Anand Observing Nimarjan Places

కేవ‌లం కొన్ని గంట‌లు మాత్ర‌మే ఉండ‌డంతో ట్రాఫిక్ ను దారి మ‌ళ్లించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ త‌నిఖీలు కూడా చేప‌డుతున్నారు. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌నలు జ‌ర‌గ‌కుండా ముంద‌స్తుగా సెక్యూరిటీ పెంచారు. ఇత‌ర జిల్లాల నుంచి కూడా పోలీసుల‌ను న‌గ‌రానికి ర‌ప్పించారు.

ఇందులో భాగంగా ఎస్బీ, ఎల్ అండ్ ఓ చీఫ్ ల‌తో క‌లిసి న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్(CV Anand) న‌గ‌రంలోని బాలాపూర్ నుండి ప్రారంభ‌మ‌య్యే వినాయ‌కుడి స్థ‌లాన్ని ప‌రిశీలించారు. న‌గ‌ర‌మంతా క‌లియ తిరిగారు. ఎక్క‌డి నుంచి ఎక్క‌డికి వినాయ‌కులు రావాల‌నే దానిపై కూడా ఇప్ప‌టికే క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

ఇదే స‌మ‌యంలో గ‌ణేశ్ ఉత్స‌వ క‌మిటీల‌తో స‌మావేశం అయ్యారు. వారికి కీల‌క సూచ‌న‌లు కూడా ఇచ్చారు. సుదూర ప్రాంతాల నుండి న‌గ‌రానికి వ‌చ్చే ప్ర‌యాణీకుల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు సీవీ ఆనంద్

Also Read : AP CM YS Jagan : ఆరోగ్య సుర‌క్ష శ్రీ‌రామ ర‌క్ష – జ‌గన్

Leave A Reply

Your Email Id will not be published!