CWG 2022 Sudhir : పారా పవర్ లిఫ్టింగ్ లో సుధీర్ కు స్వర్ణం
కామన్వెల్త్ గేమ్స్ 2022లో పతకాల పంట
CWG 2022 Sudhir : బ్రిటన్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ -2022 లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మన దేశం ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ లో సుధీర్(CWG 2022 Sudhir) బంగారు పతకాన్ని సాధించాడు.
అరుదైన ఘనతను సాధించాడు. మొత్తం 134.5 పాయింట్లతో చరిత్ర సృష్టించాడు కామన్వెల్త్ గేమ్స్ లో. సుధీర్ తన మొదటి ప్రయత్నంలో 208 కేజీలు ఎత్తాడు. రెండోసారి ప్రయత్నంలో 212 కేజీలు ఎత్తి ఆధిక్యంలోకి వెళ్లాడు.
27 ఏళ్ల సుధీర్ ఆసాయి పారా గేమ్స్ లో కాంస్య పతకాన్ని సాధించాడు. పోలియో ప్రభావం కారణంగా ఇబ్బంది పడ్డాడు. కానీ కష్టపడి, ఇబ్బందులు ఎదుర్కొని అతను అనుకున్నది సాధించాడు.
అతడి సుదీర్గ కల కామన్వెల్త్ లో పారా వెయిట్ లిఫ్టింగ్ లో బంగారు పతకాన్ని సాధించాలని. తన కలను సాకారం చేసుకున్నాడు. ఈ ప్రయాణంలో ఆటు పోట్లను ఎదుర్కొని విజేతగా నిలిచాడు.
కామన్వెల్త్ గేమ్స్ లో పారా స్పోర్స్ విభాగంలో స్వర్ణ పతకంతో తన ఖాతాను తెరిచాడు. భారత్ కు గర్వ కారణంగా నిలిచాడు పవర్ లిఫ్టర్ సుధీర్. ఇక ఇదే విభాగంలో ఇకెచుక్వు క్రిస్టియన్ ఒడిచుక్కు 133.6 పాయింట్లో రజతం గెలుచుకున్నాడు.
మరో పవర్ లిఫ్టర్ మిక్కీ యుల్ 130.9 పాయింట్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా గత జూన్ లో దక్షిణ కొరియాలో జరిగిన వరల్డ్ పారా పవర్ లిఫ్టింగ్ ఆసియా – ఓషియానియా ఓపెన్ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకాన్ని సాధించాడు సుధీర్.
Also Read : ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీస్ వీళ్లే