Cyrus Mistry : మిస్త్రీ మరణం భారత్ కు తీరని నష్టం
దిగ్గజ వ్యాపార వేత్తను కోల్పోవడం బాధాకరం
Cyrus Mistry : ఇది ఎవరూ ఊహించని పరిణామం. ప్రముఖ భారతీయ వ్యాపారవేత్తగా రాణించారు. తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. అతి తక్కువ కాలంలోనే అంచెలంచెలుగా ఉన్నత పదవిని అధిరోహించిన సైరస్ పల్లోంజి మిస్త్రీ(Cyrus Mistry) ఉన్నట్టుండి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
కానీ ఆయన తను నిర్మించిన సామ్రాజ్యం అలాగే ఉండి పోయింది. ఎవరు బాధ్యత వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. షాపుర్టీ పల్లోంజీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గా , టాటా సంస్థల గ్రూప్ మాజీ చైర్మన్ గా మిస్త్రీ కొలువు తీరారు.
1991లో మిస్త్రీ కుటుంబ యాజమాన్యం లోని నిర్మాణ వ్యాపారమైన షాపుర్టీ పల్లోంజీ , కో లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్ గా పని చేయడం ప్రారంభించారు. ఇదే సమయంలో కీలకమైన టాటా సంస్థకు చైర్మన్ గా కూడా ఉన్నారు.
టాటా సన్స్ బోర్డు నుండి పదవీ విరమణ చేసిన ఒక ఏడాది తర్వాత మిస్త్రీ సెప్టెంబర్ 1, 2006న టాటా సన్స్ లో 18.4 శాతం వాటాతో చేరారు. సైరస్ మిస్త్రీ(Cyrus Mistry) ఒకే సంస్థ కలిగి ఉన్న అతి పెద్ద షేర్లను కలిగి ఉన్నాడు.
సెప్టెంబర్ 24, 1990 నుండి అక్టోబర్ 26, 2009 వరకు టాటా ఎల్క్సీ లిమిటెడ్ కు డైరెక్టర్ గా , సెప్టెంబర్ 18, 2006 దాకా టాటా పవర్ కి డైరెక్టర్ గా పని చేశాడు. 2013లో టాటా సన్స్ చైర్మన్ గా నియమితుడయ్యాడు.
టాటా ఇండస్ట్రీస్ , టాటా స్టీల్, టాటా మోటార్స్ , టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ , టాటా పవర్ , టాటా టెలిసర్వీస్, ఇండియన్ హొటల్స్, టాటా గ్లోబల్ బెవరేజెస్ , టాటా కెమికల్స కు(TATA Group) కూడా పని చేశాడు.
స్టీల్ , లగ్జరీ కార్లు, ఉప్పు దాకా ప్రతి కంపెనీకి బాధ్యత వహించాడు. అక్టోబర్ 2016లో టాటా చైర్మన్ పదవి నుంచి తొలగించబడ్డాడు.
ప్రముఖ పత్రిక ది ఎకానమిస్ట్ తన వ్యాసంలో భారత దేశం, బ్రిటన్ రెండింటిలోనూ అత్యంత ముఖ్యమైన పారిశ్రామికవేత్తను కోల్పోయిందని పేర్కొంది.
ఎంతో అనుభవం కలిగిన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన సైరస్ మిస్త్రీ ఉన్నట్టుండి కాలం ఇంకొంత కాలం పాట ఉంచనీయకుండా చేసింది. ఇదొక్కడే బాధాకరం. వ్యాపార, వాణిజ్య రంగానికి కోలుకోలేని దెబ్బ.
Also Read : జార్ఖండ్ లో తేలనున్న భవితవ్యం