Cyrus Mistry : రోడ్డు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ దుర్మరణం
టాటా సన్స్ సంస్థ మాజీ చైర్మన్
Cyrus Mistry : మహారాష్ట్రలోని ముంబై సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ (Cyrus Mistry) దుర్మరణం చెందారు. ఆయన వయస్సు 54 ఏళ్లు.
సైరస్ మిస్త్రీ తన మెర్సిడెస్ కారులో అహ్మదాబాద్ నుండి ముంబైకి తిరిగి వస్తుండగా మహారాష్ట్ర లోని పాల్ఘర్ వద్ద డివైడర్ పై కూలి పోయింది. సూర్య నది వంతెనపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రి పాలయ్యారు. పాల్ఘర్ ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం కారు డివైడర్ ను ఢీకొట్టింది.
ఆయన పూర్తి పేరు సైరస్ పల్లోంజి మిస్త్రి. 4 జూలై 1968లో పుట్టారు. భారత దేశంలో జన్మించిన ఐరిష్ వ్యాపారవేత్త. 2012 నుండి 2016 వరకు టాటా గ్రూప్ సంస్థకు చైర్మన్ గా ఉన్నారు.
సదరు సంస్థకు ఆరవ చైర్మన్ గా పని చేశారు. 2016లో ఆయన అనూహ్యంగా తప్పించింది. మిస్త్రీ తర్వాత రతన్ టాటా తాత్కాలిక చైర్మన్ గా తిరిగి వచ్చారు.
కొన్ని నెలల తర్వాత నటరాజన్ చంద్రశేఖరన్ కొత్త చైర్మన్ గా ఎన్నికయ్యారు. డిసెంబర్ 2019లో నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ చంద్రశేఖర్ ను ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నియమించడాన్ని చట్ట విరుద్దంగా ప్రకటించింది.
తిరిగి సైరస్ మిస్త్రీని పునరుద్దరించింది. సుప్రీంకోర్టు 10 జనవరి 2020న ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వుపై స్టే విధించింది. ఆ తర్వాత భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం అతడి తొలగింపు సబబే అని స్పష్టం చేసింది.
Also Read : మౌనంగా ఉంటే దేశాన్ని అమ్మేస్తారు