Sourav Ganguly : తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి షోకాజ్ నోటీసులు కోహ్లీకి పంపించాలని అనుకుంటున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly ).
అది పూర్తిగా నిజం కాదని పేర్కొన్నారు. గత ఏడాది యూఏఈ వేదికగా టీ20 స్కిప్పర్ గా తప్పుకున్నాడు. ఆ తర్వాత వద్దని చెప్పా. ఈ విషయాన్ని కోహ్లీకి స్పష్టం చేశా. కానీ కోహ్లీ ఒప్పు కోలేదని స్పష్టం చేశాడు సౌరవ్ గంగూలీ.
కానీ తను వినిపించు కోలేదని తెలిపాడు దాదా. ఇదిలా ఉండగా దక్షిణాఫ్రికా టూర్ కు వెళ్లే కంటే ముందు వర్చువల్ గా కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. తనను గంగూలీ సంప్రదించ లేదని అదంతా ఒట్టి అబద్దమంటూ బాంబు పేల్చాడు.
దీనిపై దాదా స్పందించాడు. తాను అడిగింది వాస్తవమేనని పేర్కొన్నాడు. దీంతో బీసీసీఐ కాంట్రాక్టు ప్రకారం కోహ్లీ తన రూల్స్ అతిక్రమించాడని ఏకంగా బీసీసీఐ చీఫ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడని, సంస్థ నియమ నిబంధనల ప్రకారం అతడికి షోకాజ్ నోటీసు ఇవ్వాల్సిందేనని బీసీసీఐ యోచించింది.
దీనిపై బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ కూడా క్లారిటీ ఇచ్చాడు. కెప్టెన్సీ మార్పుపై తాము విరాట్ కోహ్లీకి తెలియ చేశామని చెప్పాడు. అంతే కాదు కోహ్లీ అబద్దాలు ఆడుతున్నాడంటూ ఆరోపించాడు.
దీంతో దేశ వ్యాప్తంగా కోహ్లీ అనూహ్యంగా తప్పు కోవడం వెనుక గంగూలీ ఉన్నాడంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై షోకాజ్ నోటీసుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు గంగూలీ.
Also Read : రాణించిన రాహుల్..పంత్