Sourav Ganguly : బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. ప్రపంచ క్రికెట్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆటగాడిగా దూకుడు ప్రదర్శిస్తూ వచ్చిన దాదా భారత దేశంలో మతం కంటే ఎక్కువగా ఆరాధించే క్రికెట్ ను శాసించే
భారత క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐకి అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు.
ఆ తర్వాత అప్పటి దాకా సంప్రదాయ పద్దతిలో కొనసాగుతున్న సదరు సంస్థలో పెను మార్పులు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేశాడు.
ఏ పనినైనా త్వరగా పూర్తి చేయాలన్నది అతడి సంకల్పం.
ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చేయాలనే తపనతో మరింత దూకుడు పెంచాడు గంగూలీ(Sourav Ganguly ).
ఇదే తరుణంలో కొన్ని నిర్ణయాలు వివాదాస్పం కావడం ఇబ్బందికరంగా మారింది.
ఇటీవల దాదాను బాగా ఇబ్బందికి గురి చేసిన అంశం భారత క్రికెట్ జట్టుకు ఏడేళ్లుగా కెప్టెన్ గా విశిష్ట సేవలు అందించిన విరాట్ కోహ్లీ కామెంట్ చేయడం కలకలం రేపింది.
తనతో గంగూలీ ఫోన్ లో మాట్లాడ లేదంటూ ఆరోపించాడు. ఆ తర్వాత స్కిప్పర్ గా తప్పుకున్నాడు. ఇదే సమయంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి దాదాపై.
తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారనే విమర్శను ఎదుర్కొంటున్నారు.
బోర్డు నియమ నిబంధనలకు విరుద్దంగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్వహించే సమావేశాలకు హాజరు అవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
గంగూలీ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలి పోయినట్లు ప్రచారం జరుగుతోంది. దాదా వ్యవహార శైలి పై వ్యతిరేక వర్గం జాతీయ మీడియాకు ఎక్కడం ఇప్పుడు కలకలం రేపింది.
జట్టు ఎంపిక చేసే విషయంలో కోచ్, కెప్టెన్ ముఖ్యం. కానీ దాదా రాకతో వారు ఏమీ చేయలేక పోతున్నారు.
విచిత్రం ఏమిటంటే గంగూలీ(Sourav Ganguly ) పేరు ప్రస్తావించక పోయినా ఓ పేరు మోసిన జర్నలిస్టు ట్విట్టర్ లో ప్రస్తావించడం చర్చకు దారితీసింది.
గంగూలీ వ్యవహారంపై నెటిజన్లు సైతం సీరియస్ అవుతున్నారు. ఏది ఏమైనా బీసీసీఐలో రాజకీయాలను పక్కన పెట్టి గాడిన పెట్టిన ఘనత మాత్రం గంగూలీదే. ఒక్కోసారి కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉంటాయి. వాటిని స్వీకరించక తప్పదు.
Also Read : ఐపీఎల్ వేలానికి వేళాయె