Daniel Vettori : సన్ రైజర్స్ హైద్రాబాద్ కోచ్ గా వెట్టోరీ
బ్రియాన్ లారా స్థానంలో కీలక నిర్ణయం
Daniel Vettori : సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు సోమవారం ట్విట్టర్ వేదికగా ఇప్పటి వరకు జట్టుకు హెడ్ కోచ్ గా ఉన్న లారాను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆయన స్థానంలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెట్లోరి(Daniel Vettori)ని ప్రధాన కోచ్ గా నియమించినట్లు వెల్లడించింది.
Daniel Vettori As a SRH Coach
ఇప్పటి వరకు పలుమార్లు జట్టుకు సంబంధించి ఆటగాళ్లను, కోచ్ లను మారుస్తూ వచ్చింది ఎస్ ఆర్ హెచ్ యాజమాన్యం. కానీ ఎక్కడా ఆ జట్టు ప్రతిభ కనబర్చ లేదు. ఎస్ఆర్ హెచ్ ను సన్ యాజమాన్యం టేకోవర్ చేసుకుంది. ఆ సంస్థకు చెందిన దయానిధి మారన్ కూతురు కావ్య మారన్ టేకోవర్ చేసుకుంది. ప్రస్తుతం ఆమె సిఇవో గా కొనసాగుతున్నారు.
కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. భారీ ఎత్తున ఆటగాళ్లపై డబ్బులను పోసింది. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) కు సంబంధించి 2022, 2023లో తీవ్ర నిరాశ పరిచింది. చివరకు లారాను మార్చినా జట్టులో మార్పు చోటు చేసుకోలేదు. ఈఏడాది జరిగిన ఐపీఎల్ లో 14 మ్యాచ్ లకు గాను 4 మ్యాచ్ లు గెలిచింది. 10మ్యాచ్ లలో ఓటమి పాలైంది. దీంతో లారాను తప్పించి వెట్టోరీకి ఛాన్స్ ఇచ్చింది.
Also Read : Rahul Gandhi : పార్లమెంట్ కు హాజరైన రాహుల్