Daniel Vettori : ఐపీఎల్ 2022లో జరిగిన లీగ్ మ్యాచ్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అంపైర్ నిర్ణయంపై అభ్యంతరం చెప్పడంపై సంజూపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కెప్టెన్ అంపైర్ ను వెక్కిరించడంలో ఎలాంటి సందేహం లేదని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరి(Daniel Vettori )పేర్కొన్నారు. ఈ విషయంలో సంజూ శాంసన్ కు మ్యాచ్ పరంగా జరిమానా విధించ కూడదని సూచించాడు.
కెప్టెన్ లు విస్తృత కాల్ లను కూడా సమీక్షించేందుకు వీలుగా నిర్ణయ సమీక్ష వ్యవస్థ (డీఆర్ఎస్ ) ను పొడిగించాలని వెట్టోరీ స్పష్టం చేశాడు. మ్యాచ్ లను దూరంగా ఉండి చూస్తే ఏదీ అర్థం కాదన్నారు.
ప్రధానంగా లక్షలాది కళ్లు పరీక్షిస్తుంటాయి. వందలాది కెమెరాలు విస్తృతంగా పర్యవేక్షిస్తుంటాయని తెలిపాడు వెటోరి. ప్రధానంగా అంపైర్లపై ఎక్కువగా ఒత్తిడి ఉంటుందన్నారు.
మ్యాచ్ లు జరుగుతున్న సందర్భంలో ఆటగాడు నిర్ణయం తీసుకోగలగాలని పేర్కొన్నాడు. బౌలర్లకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం కొంత ఇబ్బంది కలిగించే అంశమన్నాడు.
అంపైర్లు అప్పుడప్పుడు, అనుకోకుండా తీసుకునే తప్పుడు నిర్ణయాలను పునః సమీక్షించేందుకు డీఆర్ఎస్ వ్యవస్థను తీసుకు వచ్చామన్నాడు వెటోరి.
ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు , అభిమానులు కూడా న్యాయ నిర్ణేతలుగా ఒక్కోసారి పరకాయ ప్రవేశం చేస్తాడన్నాడని తెలిపారు. కోల్ కతా నైట్ రైడర్స్ ఛేజింగ్ లో భాగంగా చివరి ఓవర్ లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ప్రసిద్ద్ కృష్ణ బ్యాటర్లు నితీస్ రాణా, రింకు సింగ్ లకు ఆఫ్ స్టంప్ వెలుపల బంతులు వేశాడు.
మూడో బంతిని అంపైర్ నితిన్ పండిట్ వైడ్ గా నిర్ణయించాడు. ఆ పిలుపు సంజూ శాంసన్ కు నచ్చ లేదు. దీనిపై అభ్యంతరం చెప్పడం చర్చకు దారి తీసింది.
Also Read : రింకూ సింగ్ బ్యాటింగ్ సూపర్