Daniel Vettori : ఈసారి ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 సీజన్ లో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పేలవమైన ప్రదర్శనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లలో ఒక్క గుజరాత్ టైటాన్స్ తో మాత్రమే 58 రన్స్ చేశాడు.
ఇక రెండు సార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఇక ఐపీఎల్ లో అత్యంత తక్కువ పరుగులు చేసిన ముగ్గురు ఆటగాళ్లలో కోహ్లీ ఒకడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడిన మ్యాచ్ లో 33 బంతులు ఎదుర్కొని 30 పరుగులు చేశాడు.
ఇందులో భారీ షాట్స్ లేక పోవడం విశేషం. దీనిపై స్పందించాడు న్యూజిలాండ్ మాజీ బ్యాటర్ డేనియల్ వెట్టోరి(Daniel Vettori ). ఏ దశలోనూ కసితో ఆడాలన్నది తనకు కోహ్లీలో కనిపించ లేదని కామెంట్ చేశాడు.
పవర్ ప్లేలో ఎవరు బౌలింగ్ చేసినా షాట్స్ కొట్టేందుకు వెళ్లడం లేదు. కేవలం సింగిల్స్ తీసేందుకే ట్రై చేస్తున్నాడు. ఇది ఎంత మాత్రం స్టార్ ప్లేయర్ కు మంచిది కాదని పేర్కొన్నాడు డేనియల్ వెట్టోరి.
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ మోయిన్ అలీ తెలివిగా బౌలింగ్ చేశాడు. దీంతో వికెట్ పారేసుకున్నాడని తెలిపాడు. ఇప్పటి దాకా ఆడిన మ్యాచ్ లలో ఏవీ చెప్పుకోతగ్గ, కోహ్లీ ఆట తీరుకు తగిన రీతిలో స్కోర్ లేదన్నది క్రికెట్ వర్గాల అభిప్రాయం.
ఇకనైనా రాబోయే మ్యాచ్ లలో నైనా కోహ్లీ రాణించాల్సి ఉంది. భారత్ ఈ ఐపీఎల్ తర్వాత పలు జట్లతో సీరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఇదే ఏడాది ఆసిస్ లో టీ20 వరల్డ్ కప్ కు సిద్దం కావాల్సి ఉంది.
ఈ సమయంలో కీలక ఆటగాడిగా ఉన్న కోహ్లీ ఆటపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.
Also Read : ఉమ్రాన్ మాలిక్ అరుదైన ఘనత