Danish Kaneria : క‌నేరియా సంచ‌ల‌న కామెంట్స్

భార‌త జ‌ట్టులో లుక‌లుక‌లు

Danish Kaneria : పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ దానిష్ క‌నేరియా సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. భార‌త క్రికెట్ జ‌ట్టు ఇటీవ‌ల పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న ఆడ‌డంపై స్పందించాడు.

ఈ మేర‌కు టీమిండియాలో రెండు గ్రూపులు ఉన్నాయ‌ని, వాళ్లు విడి పోయిన‌ట్లు అనిపిస్తోందంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు. ఆ రెండు గ్రూపులలో ఒక దానికి విరాట్ కోహ్లీ నాయ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా మ‌రో గ్రూప్ న‌కు కేఎల్ రాహుల్ సార‌థ్యం వ‌హిస్తున్నాడంటూ పేర్కొన్నాడు.

దీని వ‌ల్ల‌నే టీమిండియా గెలుపుపై ఫోక‌స్ పెట్ట‌లేక పోతుంద‌న్నాడు. స‌ఫారీ టూర్ లో భాగంగా ఫ‌స్ట్ వ‌న్డే లో 31 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. ఇక మిడిలార్డ‌ర్ పూర్తిగా విఫ‌ల‌మైంది.

ఈ త‌రుణంలో భార‌త పేల‌వ‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించ‌డంపై తాజా, మాజీ ఆట‌గాళ్లు నిప్పులు చెరుగుతున్నారు. పేరుకు అంతా స్టార్లే ఉన్న‌ప్ప‌టికీ ఎందుకు టీమిండియా మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చ‌డం లేదంటూ ప్ర‌శ్నించాడు ఈ పాకిస్తాన్ మాజీ ప్లేయ‌ర్ దానిష్ క‌నేరియా(Danish Kaneria).

ఇలాగైతే భార‌త జ‌ట్టు క‌ష్ట‌మ‌న్నాడు. గెల‌వాల‌న్న క‌సి ఎక్క‌డా భార‌త ఆట‌గాళ్ల‌ల‌లో క‌నిపించ‌డం లేదంటూ మ‌రో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. రాను రాను ఉన్నా లేన‌ట్టేన‌న్న భావ‌న అభిమానుల్లో క‌ల‌గ‌డం ఖాయ‌మ‌న్నాడు.

ఇప్ప‌టికైనా టీమిండియా త‌మ ఆట తీరును మెరుగు ప‌ర్చు కోవాల‌ని ఆ మేర‌కు రాహుల్ ద్ర‌విడ్ ట్రై చేస్తాడ‌ని ఆశిస్తున్న‌ట్లు పేర్కొన్నాడు.

విచిత్రం ఏమిటంటే ఫ‌స్ట్ వ‌న్డే ఆడే స‌మ‌యంలో రాహుల్ ఓ వైపు కోహ్లీ ఇంకో వైపు కూర్చున్నారంటూ ఆరోపించాడు. దీనిపై ఇంకా బీసీసీఐ స్పందించ లేదు.

Also Read : టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్ విడుద‌ల

Leave A Reply

Your Email Id will not be published!