David Hussy : భారత ఆటగాడు ఉమేష్ యాదవ్ పై ప్రశంసల జల్లు కురిపించాడు కోల్ కతా నైట్ రైడర్స్ మెంటార్ డేవిడ్ హస్సీ (David Hussy ). ఇదిలా ఉండగా టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తో కలిసి పని చేశాడు.
ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో కేకేఆర్ మేనేజ్ మెంట్ ఉమేష్ ను ర. 2 కోట్లకు తీసుకుంది. వికెట్లు తీయడంలో ముందంజలో ఉన్నాడని కితాబు ఇచ్చాడు హస్సీ. ప్రారంభంలోనే ప్రత్యర్థి జట్టుపై ప్రభావం చూపిస్తున్నాడని పేర్కొన్నాడు.
మైదానంలో అద్భుతంగా వర్క్ చేస్తాడు. నేర్చుకునేందుకు ఇష్ట పడతాడని తెలిపాడు. బౌలర్లను తీర్చి దిద్దడంలో భరత్ అరుణ్ కీలకంగా వ్యవహరిస్తున్నాడని ఈ క్రెడిట్ అంతా అతడికే దక్కుతుందన్నాడు.
కాగా ఐపీఎల్ 2022లో ఉమేష్ యాదవ్ 8 వికెట్లు తీశాడు. పర్చుల్ క్యాప్ జాబితాలో టాప్ లో కొనసాగుతున్నాడు. ఓవరకు 4.9 పరుగుల అద్భుతమైన ఎకానమీ రేటును కలిగి ఉన్నాడని పేర్కొన్నాడు.
పేసర్ గా రాణిస్తున్నాడని తెలిపాడు. ఉమేష్ యాదవ్ ను డేవిడ్ హస్సీ(David Hussy )బెస్ట్ బై ఇన్ ది ఐపీఎల్ అని పిలిచాడు. భారతీయ పేసర్లలో టాప్ బౌలర్ గా ఉన్నాడని పేర్కొన్నాడు మెంటార్.
ఇదిలా ఉండగా కేకేఆర్ ఐపీఎల్ లీగ్ లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్ లు ఆడింది. రెండింట్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ లో ఓడి పోయింది.
అద్భుతమైన స్పెల్ తో బౌలింగ్ చేస్తున్నాడని పేర్కొన్నాడు హస్సీ. ఇదిలా ఉండగా కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం.
Also Read : పీఎస్ఎల్ కంటే ఐపీఎల్ పవర్ ఫుల్