David Miller : డేవిడ్ మిల్లర్ షాన్ దార్ కిల్లర్
38 బంతులు 3 ఫోర్లు 5 సిక్సర్లు
David Miller : ఐపీఎల్ 2022లో అంతా ఊహించినట్లు గానే హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ దుమ్ము రేపింది. కోల్ కతా ఈడెన్ గార్డెన్ లో జరిగిన క్వాలిఫయిర్ -1 లో 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ను ఓడించింది.
పోటీ ఇరు జట్ల మధ్య హోరా హోరీగా సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 188 రన్స్ చేసింది.
అనంతరం 189 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఇంకా 3 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
ఆఖరి ఓవర్ లో 16 పరుగులు కావాల్సి ఉండగా కిల్లర్ గా పేరొందిన డేవిడ్ మిల్లర్ (David Miller) దంచి కొట్టాడు. ప్రసిద్ద్ క్రిష్ణ వేసిన ఓవర్ లో వరుసగా 3 సిక్సర్లు బాదాడు. తన జట్టుకు అద్భుత విజయాన్ని సాధించి పెట్టాడు.
ఎప్పటి లాగే కీలకమైన మ్యాచ్ లో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు హార్దిక్ పాండ్యా. చివరి వరకు ఉన్నాడు. ఇక ఆఖరులో వచ్చిన మిల్లర్ విధ్వంసకరమైన ఇన్నింగ్స ఆడాడు.
కేవలం 38 బంతులు మాత్రమే ఆడిన మిల్లర్ 5 సిక్సర్లు 3 ఫోర్లు కొట్టాడు. 68 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ పాండ్యా 27 బంతులు
ఆడి 5 ఫోర్లతో 40 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.
శుభ్ మన్ గిల్ 21 బంతులు ఆడి 5 ఫోర్లు ఒక సిక్సర్ తో 35 పరుగులు చేస్తే మాథ్యూ వేడ్ 30 బంతులు ఆడి 35 చేశాడు. ఇందులో ఆరు
ఫోర్లు ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే వరుసగా టాస్ ఓడిపోతూ రావడం కూడా సంజూ శాంసన్ కు ఇబ్బందిగా మారింది.
ఈసారి మాత్రం అద్భుతంగా ఆడాడు కేరళ స్టార్. ఏది ఏమైనా చివరి దాకా చేసిన ప్రయత్నం ఫలించ లేదు. పాండ్యా, మిల్లర్ రాజస్తాన్
ఆశలపై నీళ్లు చల్లారు.
Also Read : చెలరేగిన బట్లర్ మెరిసిన శాంసన్