David Warner Pathan : ప‌ఠాన్ గా మారిన డేవిడ్ వార్న‌ర్

ఆసిస్ స్టార్ క్రికెట‌ర్ వీడియో వైర‌ల్

David Warner Pathan : ప్ర‌పంచ క్రికెట్ లో మోస్ట్ పాపుల‌ర్ క్రికెటర్ గా పేరొందాడు ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ హిట్ట‌ర్ బ్యాట‌ర్ డేవిడ్ వార్న‌ర్. మైదానంలోకి దిగాడంటే ప‌రుగుల వ‌ర‌ద పారాల్సిందే. గ‌త రెండేళ్లుగా దుమ్ము రేపుతూ వ‌స్తున్నాడు. టీ20, వ‌న్డే, టెస్టు ఫార్మాట్ ల‌లో స్థిరంగా ఆడుతూ వ‌స్తున్నాడు. మిగ‌తా క్రికెట‌ర్లు వేరు వార్న‌ర్ వేరు.

ఎందుకంటే వ‌ర‌ల్డ్ వైడ్ గా సామాజిక మాధ్య‌మాల‌లో యాక్టివ్ గా ఉంటారు. సినిమాల‌కు సంబంధించి మీమ్స్ త‌యారు చేయ‌డంలో మ‌నోడు ముందంజ‌లో ఉంటాడు. ఇప్ప‌టికే సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పుష్ప మూవీకి సంబంధించి పోస్ట్ లు చేస్తూ హ‌ల్ చ‌ల్ చేశాడు. ఏ సినిమా వ‌చ్చినా ఆ మూవీకి సంబంధించి సాంగ్స్ , డైలాగులను అనుక‌రిస్తూ వైర‌ల్ గా మారుతూ వ‌స్తున్నాడు డేవిడ్ వార్న‌ర్.

ఇక ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) లో ఆసిస్ క్రికెట‌ర్ కు తెలుగు వారితో ద‌గ్గ‌రి అనుబంధం ఉంది. ఎందుకంటే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు ప్రాతినిధ్యం వ‌హించాడు. ఆ జ‌ట్టును ఏకంగా ఛాంపియ‌న్ గా నిలిపాడు. ఏమైందో ఏమో కానీ ఆ జ‌ట్టు మేనేజ్ మెంట్ డేవిడ్ వార్న‌ర్ ను నిర్ధాక్షిణ్యంగా తొల‌గించింది. ఆ త‌ర్వాత ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌పున ఆడుతున్నాడు.

తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ , దీపికా ప‌దుకొనే క‌లిసి న‌టించిన ప‌ఠాన్ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద కోట్లు కొల్ల‌గొడుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన డైలాగులు, సాంగ్స్ దుమ్ము రేపుతున్నాయి. ప్ర‌స్తుతం డేవిడ్ వార్న‌ర్ షారుఖ్ పాత్ర‌లో ఒదిగి పోయాడు(David Warner Pathan). ఇందుకు సంబంధించి వీడియోను షేర్ చేశాడు. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్ గా మారింది.

Also Read : ఘ‌న విజ‌యం ష‌ఫాలీ భావోద్వేగం

Leave A Reply

Your Email Id will not be published!