David Warner : వారెవ్వా డేవిడ్ వార్నర్
మరోసారి రాణించిన కెప్టెన్
David Warner : ఐపీఎల్ 16వ సీజన్ లో అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ పుంజుకున్నా చివరకు టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో ప్లే ఆఫ్ రేసుకు వెళ్లాలని ఆశించిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఆశలపై నీళ్లు చల్లింది ఢిల్లీ క్యాపిటల్స్.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 213 రన్స్ చేసింది. ఓపెనర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పృథ్వీ షా అత్యంత బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ టోర్నీలో వరుసగా విఫలం అవుతూ వచ్చిన షా ఈసారి రెచ్చి పోయాడు. లీగ్ లో తన తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇక డేవిడ్ వార్నర్ మరోసారి సత్తా చాటాడు. ఈ సీజన్ లో ఆ జట్టు నుంచి అత్యధికంగా పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచాడు.
ఇదిలా ఉండగా కెప్టెన్ వార్నర్ తో కలిసి పృథ్వీ షా 94 పరుగుల భాగస్వామ్యం అందించాడు. దీంతో ఆరంభం నుంచే ఢిల్లీ క్యాపిటల్స్ ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చింది. డేవిడ్ వార్నర్ 31 బంతులు ఎదుర్కొని 46 రన్స్ చేశాడు. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ స్కిప్పర్ శిఖర్ ధావన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్ దారి పట్టాడు. ఇక పృథ్వీ షా 38 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు ఒక సిక్సర్ తో 54 రన్స్ చేశాడు. ఇక రీల్ రుసో పంజాబ్ కింగ్స్ కు చుక్కలు చూపించాడు.
Also Read : PBKS vs DC IPL 2K23