David Warner : ప్రపంచ క్రికెట్ చరిత్రలో పడి లేచిన క్రికెటర్లు ఎందరో. భారత క్రికెట్ జట్టుకు ఎనలేని విజయాలు అందించిన మహమ్మద్ అజహరుద్దీన్ కూడా అవమానాలు ఎదుర్కొన్నాడు. మళ్లీ పుంజుకున్నాడు.
ఆటగాడు అన్నాక వ్యక్తిగతమైన బలహీనతలు ఉండటం సహజమే. ఒక జట్టుకు ఎనలేని సేవలు అందిస్తూ టైటిల్ అందించిన కెప్టెన్ ను తొలగించిన ఏకైక మేనేజ్ మెంట్ ఏదైనా ఉందంటే అది సన్ రైజర్స్ హైదరాబాద్.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆసిస్ స్టార్ హిట్టర్ గా పేరొందిన డేవిడ్ వార్నర్. అతడికి హైదరాబాద్ కు విడదీయరాని బంధం ఉంది. మనోడు అందరి కంటే ఎక్కువగా అభిమానులను కలిగి ఉన్నాడు.
తనను ఏ జట్టు అయితే తిరస్కరించిందో అదే జట్టుపై అద్భుతంగా ఆడి కసి తీర్చుకున్నాడు వార్నర్(David Warner). జట్టు నుంచి అనూహ్యంగా తప్పించేశారు. కానీ ఎక్కడా పల్లెత్తు మాట అనలేదు డేవిడ్.
సన్ రైజర్స్ హైదరాబాద్ తో ముంబై వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 12 ఫోర్లు 3 భారీ సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. సెంచరీకి 8 పరుగుల దూరంలో ఉన్నా తన సోదరుడు పావెల్ ఆడేందుకు చాన్స్ ఇచ్చాడు.
ఇది క్రీడా స్ఫూర్తి అంట. 92 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇక డేవిడ్ వార్నర్ (David Warner)అరుదైన ఘనతను సాధించాడు. అద్భుతమైన రికార్డు నమోదు చేశాడు.
పొట్టి ఫార్మాట్ లో అత్యధికంగా హాఫ్ సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్ గా నిలిచాడు. ఇప్పటి దాకా క్రిస్ గేల్ మీద ఉన్న 83 హాఫ్ సెంచరీలను దాటేసి 84వ హాఫ్ సెంచరీతో తనకు ఎదురు లేదని చాటాడు.
Also Read : ముంబై మెరిసేనా గుజరాత్ గెలిచేనా