David Warner Skipper : కెప్టెన్సీ రేసులో డేవిడ్ వార్నర్
పంత్ కు గాయం ఐపీఎల్ కు దూరం
David Warner Skipper : అనుకోని రీతిలో ఢిల్లీ క్యాపిటల్స్ స్కిప్పర్ రిషబ్ పంత్ రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. డెహ్రాడూన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ మినీ వేలం ముగిసింది. 2023 లో జరిగే ఇండియన ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్)లో రిషబ్ పంత్ ఆడతాడా లేదా అన్నది అనుమానం నెలకొంది.
ఈ తరుణంలో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఎవరిని కెప్టెన్ గా ఎంపిక చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఐపీఎల్ లో దుమ్ము రేపడమే కాకుండా ఒకసారి సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఏకంగా ఛాంపియన్ షిప్ దక్కేలా చేసిన ఆసిస్ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ ను పరిశీలిస్తున్నారు.
మనోడు ఆస్ట్రేలియాలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో తన 100వ టెస్టులో దుమ్ము రేపాడు. గత ఏడాది 2021లో దుబాయ్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో కోల్పోయిన ఫామ్ ను తిరిగి ప్రదర్శించాడు. ఏకంగా ఆస్ట్రేలియాను విశ్వ విజేతగా నిలిపేలా చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
ఆ తర్వాత ఈ ఏడాది 2022లో జరిగిన ఐపీఎల్ లో డేవిడ్ వార్నర్(David Warner Skipper) అతి తక్కువ ఖర్చుతో ఢిల్లీకి మారాడు. వ్యక్తిగతంగా బాగానే ఆడినా ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించ లేక పోయింది. గతంలో ఐపీఎల్ లో నాయకత్వం వహించిన అనుభవం కారణంగా వార్నర్ వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది.
ఇక వార్నర్ తో పాటు మిచెల్ మార్ష్ , అక్షర్ పటేల్ పేర్లు కూడా పరిశీలించే అవకాశం లేక పోలేదు. అయితే వార్నర్ లేదా మిచెల్ ఎవరో ఒకరికి దక్కనుంది.
Also Read : భారత్ లో ఆడటం అదనపు బలం