David Warner Ruled Out : రెండో టెస్టుకు వార్న‌ర్ దూరం

డేవిడ్ కు బ‌దులుగా మ‌రో ప్లేయ‌ర్

David Warner Ruled Out : భార‌త్ లో ప‌ర్య‌టిస్తున్న ఆతిథ్య జ‌ట్టు ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బలు త‌గులుతున్నాయి. ఒక‌రి వెంట మ‌రొక‌రు గాయాల బారిన ప‌డుతున్నారు. భార‌త్ తో ప్ర‌త్యేక అనుబంధం క‌లిగిన మోస్ట్ టాలెంటెడ్, ప‌వ‌ర్ ఫుల్ బ్యాట‌ర్ గా పేరొందిన స్టార్ హిట్ట‌ర్ డేవిడ్ వార్న‌ర్ అనుకోకుండా గాయానికి గుర‌య్యాడు. ఇది ఊహించ‌ని దెబ్బ ఆసిస్ జ‌ట్టుకు.

నాలుగు టెస్టుల సీరీస్ లో భాగంగా నాగ్ పూర్ లో జ‌రిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓట‌మి పాలైంది. ప్ర‌స్తుతం ఢిల్లీ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టెస్టులో 263 ర‌న్స్ కే చాప చుట్టేసింది. ఈ త‌రుణంలో కీల‌క‌మైన బ్యాట‌ర్ గా ఉన్న వార్న‌ర్(David Warner Ruled Out) తీవ్రంగా గాయ ప‌డ‌డంతో ఒకింత కోలుకోలేని షాక్ త‌గిలింది ఆస్ట్రేలియాకు.

భార‌త బౌల‌ర్ల ధాటికి ఆసిస్ త‌క్కువ స్కోర్ కే కుప్ప కూలింది. మ‌హ్మ‌ద్ సిరాజ్ బౌలింగ్ ప‌లుమార్లు ఇబ్బంది ప‌డ్డాడు వార్నర్. ఇదే స‌మ‌యంలో బంతి గ‌ట్టిగా త‌గ‌ల‌డంతో ఆడ‌లేని ప‌రిస్థితికి చేరుకున్నాడు. చివ‌ర‌కు ష‌మీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఆడలేని స్థితిలో ఉన్న డేవిడ్ వార్న‌ర్ ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ఫిజియో థెర‌పిస్ట్ టెస్టు మ్యాచ్ లో కంటిన్యూ కావ‌డం మ‌రింత ఇబ్బందికి గురి చేస్తుంద‌ని రిపోర్ట్ ఇచ్చాడు. దీంతో డేవిడ్ వార్న‌ర్ కు బ‌దులు మాథ్యూ రేన్ షా ఫీల్డింగ్ లోకి దిగాడు. దీంతో ఆసిస్ కెప్టెన్ క‌మిన్స్ కూడా స్పందించాడు. ఒక ర‌కంగా త‌మ‌కు బిగ్ షాక్ అని వాపోయాడు.

Also Read : ఇండియా ఇంగ్లండ్ బిగ్ ఫైట్

Leave A Reply

Your Email Id will not be published!