David Warner : ముంబై వేదికగా జరుగుతున్న 15వ సీజన్ ఐపీఎల్ 2022లో ఆశ్చర్య కరమైన సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహించని రీతిలో డిఫెండింగ్ చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ ఆశించిన రీతిలో రాణించడం లేదు.
ఇంకో వైపు అనామక జట్లన్నీ దుమ్ము రేపుతున్నాయి. మొదట్లో తడబడిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు కప్ పై కన్నేసింది. ఇక గాయం కారణంగా దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ టాప్ లో నిలవడం విశేషం.
ఈ టోర్నీలో ప్రధానంగా చెప్పు కోవాల్సింది ఒకే ఒక్కడి గురించి. అతడే వరల్డ్ స్టార్ బ్యాటర్ గా పేరొందిన డేవిడ్ వార్నర్(David Warner) సత్తా చాటుతూ తనకు ఎదురే లేదని దూసుకు పోతున్నాడు.
ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ రాణిస్తూ తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు వార్నర్ (David Warner)మామ. పంజాబ్ కింగ్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ బౌలర్లు తక్కువ స్కోర్ కే కట్టడి చేశారు.
దీంతో సునాయసంగా టార్గెట్ ఛేదించారు. కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్లతో ఘన విజయాన్ని నమోదు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కు టైటిల్ తీసుకు వచ్చిన డేవిడ్ వార్నర్ తప్పుకునేలా చేసింది.
ఈ తరుణంలో బరిలోకి దిగిన వార్నార్ మామ ఈసారి ఐపీఎల్ లో దుమ్ము రేపుతున్నాడు. తాజాగా జరిగిన మ్యాచ్ లో కేవలం 30 బాల్స్ ఆడి 10 ఫోర్లు ఓ సిక్స్ తో 60 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
Also Read : దేశం కోసం ఆడాలని ఉంది – మాలిక్