David Warner : వార్నర్ మెరిసినా ఢిల్లీ సేమ్ సీన్
వరుసగా నాలుగో అపజయం
David Warner : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) లో డేవిడ్ వార్నర్(David Warner) సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ను దురదృష్టం వెంటాడుతోంది. రిషబ్ పంత్ గాయపడడంతో అతడి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్ మెంట్ ఏరికోరి ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు అప్పగించింది. వ్యక్తిగతంగా ఒకరిద్దరు రాణిస్తున్నా అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ తేలి పోయింది ఢిల్లీ క్యాపిటల్స్.
కానీ వార్నర్ మాత్రం కెప్టెన్ గా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో ఆడుతూ వస్తున్నాడు. వరుసగా తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ అలరిస్తున్నా జట్టుకు మాత్రం ఓటమి తప్పడం లేదు. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ కు బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీని డైరెక్టర్ గా నియమించుకుంది యాజమాన్యం. కానీ ఫలితం లేకుండా పోయింది. ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
తాజాగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ స్కిప్పర్ డేవిడ్ వార్నర్(David Warner) మరోసారి మెరిశాడు. ఓ వైపు వికెట్లు పోతున్నా ఎక్కడా తగ్గలేదు. 47 బంతులు ఎదుర్కొన్న వార్నర్ 51 రన్స్ చేశాడు. అతడితో పాటు ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ దుమ్ము రేపాడు. ఐపీఎల్ కెరీర్ లో తన తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. వార్నర్ 47 బంతులు ఎదుర్కొని 51 రన్స్ చేస్తే అక్షర్ పటేల్ 24 బాల్స్ ఎదుర్కొని 54 రన్స్ చేశాడు.
Also Read : రాణించిన శర్మ సత్తా చాటిన వర్మ