DC vs CSK IPL 2023 : చెన్నై ధనా ధన్ ఢిల్లీ పరేషాన్
దర్జాగా ప్లే ఆఫ్స్ కు వెళ్లిన కింగ్స్
DC vs CSK IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్(CSK) అద్బుత విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో సత్తా చాటింది. వరుసగా 12వ సారి ప్లే ఆఫ్స్ కు చేరుకుని అరుదైన ఘనత సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది.
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై భారీ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ , డేవిడ్ కాన్వే ఆకాశమే హద్దుగా చెలరేగారు. అనంతరం ఢిల్లీని అద్భుతమైన బౌలింగ్ తో కట్టడి చేశారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరోసారి సత్తా చాటాడు. కానీ జట్టును గెలిపించ లేక పోయాడు. దీంతో టోర్నీ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్(DC) నిష్క్రమించింది.
ఢిల్లీ క్యాపిటల్స్(DC) ను 77 పరుగుల భారీ తేడాతో ఓడించింది చెన్నై(CSK). నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 223 రన్స్ చేసింది. ఓపెనర్లు కాన్వే 52 బంతులు ఆడి 11 ఫోర్లు 3 సిక్సర్లతో 87 రన్స్ చేశాడు. ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. రుతురాజ్ గైక్వాడ్ 50 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 7 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 79 రన్స్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన శివబ్ దూబే 3 సిక్సర్లతో 22 రన్స్ చేయగా జడేజా 3 ఫోర్లు ఒక సిక్సర్ తో 20 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
అనంతరం 224 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. పృథ్వీ చెత్త షాట్ కొట్టబోయి వికెట్ సమర్పించుకున్నాడు. 5 పరుగులు చేశాడు. ఫీల్ సాల్ట్ 3 రన్స్ చేస్తే రాసో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. యష్ ధుల్ 13 రన్స్ చస్తే అక్షర్ పటేల్ 15, అమన్ 7 , లలిత్ 6 పరుగులు చేసి నిరాశ పరిచారు. డేవిడ్ వార్నర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 58 బంతుల్లో 7 ఫోర్లు 5 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 86 రన్స్ చేశాడు. దీపక్ చాహర్ 3, తీక్షణ , పతిరణ చెరో 2 వికెట్లు తీసుకున్నారు.
Also Read : Opposition Party Comment