DC vs RCB IPL 2023 : అబ్బా ఢిల్లీ క్యాపిట‌ల్స్ దెబ్బ

7 వికెట్ల‌తో షాన్ దార్ విక్ట‌రీ

DC vs RCB IPL 2023 : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతున్న పాఫ్ డుప్లెసిస్ సార‌థ్యం వ‌హిస్తున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది వ‌రుస ప‌రాజ‌యాల‌తో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న ఢిల్లీ క్యాపిట‌ల్స్. 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఔరా అనేలా చేసింది. ప్లే ఆఫ్ రేసుకు చేరింది. స్వంత గ్రౌండ్ లో దుమ్ము రేపింది. ఢిల్లీ బౌల‌ర్ల‌కు(DC vs RCB IPL 2023) చుక్క‌లు చూపించింది.

మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ చేసిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 181 ర‌న్స్ చేసింది. భారీ టార్గెట్ ను ఛేదించే ప్ర‌య‌త్నంలో మైదానంలోకి దిగిన ఆర్సీబీ ఊహించ‌ని రీతిలో రెచ్చి పోయింది. వ‌చ్చీ రావ‌డంతోనే దాడికి దిగింది. క‌ళ్లు చెదిరే షాట్స్ తో విరుచుకు ప‌డింది. కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ ఆరంభాన్ని ఇస్తే ఓపెన‌ర్ ఫిల‌ఫ్ సాల్ట్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు.

సుడిగాలి ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. 87 ర‌న్స్ చేశాడు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. మైదానంలో ఉన్నంత వ‌ర‌కు చూస్తూ నిల్చుండి పోయారు ఆర్సీబీ ప్లేయ‌ర్లు. జ‌ట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. కేవ‌లం 3 వికెట్లు మాత్ర‌మే కోల్పోయింది. 187 ర‌న్స్ తో టార్గెట్ పూర్తి చేసింది. రిలే ర‌స్సో కూడా స‌త్తా చాటాడు 35 ప‌ర‌గుల‌తో ఢిల్లీ క్యాపిట‌ల్స్(DC vs RCB IPL 2023) విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.

ఇదిలా ఉండ‌గా ఇంకా ఓవ‌ర్లు మిగిలి ఉండ‌గానే మ్యాక్స్ వెల్ ఓవ‌ర్ లో ర‌స్సో భారీ సిక్స్ కొట్టి ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని అందించాడు.

Also Read : ప‌తిరాణా సెన్సేష‌న్ ముంబై ప‌రేషాన్

Leave A Reply

Your Email Id will not be published!