DC vs RR IPL 2022 : ఢిల్లీ క్యాపిటల్స్ షాన్ దార్ విక్టరీ
మెరిసిన వార్నర్ మురిసిన మార్ష్
DC vs RR IPL 2022 : ఐపీఎల్ 2022లో నువ్వా నేనా అన్న రీతిలో సాగుతుందనుకున్న లీగ్ మ్యాచ్ అత్యంత పేలవంగా ఏక పక్షంగా సాగింది. ప్లే ఆఫ్స్ కు చేరుకునేందుకు ఇరు జట్లకు కీలకం కానున్న గేమ్ లో పూర్తిగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆధిపత్యం సాగించింది.
రాజస్తాన్ రాయల్స్((DC vs RR IPL 2022) పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 12 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ ఇప్పటి వరకు 6 మ్యాచ్ లలో గెలుపొందగా రాజస్థాన్ రాయల్స్ 12 మ్యాచ్ లు ఆడి 7 మ్యాచ్ లలో విజయం సాధించి 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
ఇప్పటి దాకా గుజరాత్, లక్నో ఫస్ట్ , సెకండ్ ప్లేస్ లో ఉన్నాయి. ఇక రాజస్థాన్ పై విజయం సాధించడంతో ప్లే ఆఫ్స్ ఆశలు అలాగే ఉన్నాయి.
టాస్ గెలిచిన రిషబ్ పంత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ(DC vs RR IPL 2022) బౌలర్ల దెబ్బకు రాజస్థాన్ తక్కువ స్కోర్ కే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 రన్స్ చేసింది. రవి చంద్రన్ అశ్విన్ 38 బంతులు ఆడి 50 పరుగులు చేశాడు.
ఇందులో 4 ఫోర్లు 2 సిక్స్ లు ఉన్నాయి. దేవదత్ పడిక్కల్ 30 బంతులు ఆడి 48 రన్స్ చేశాడు. ఇందులో 6 ఫోర్లు 2 సిక్స్ లు ఉన్నాయి. ఇక 161 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ(DC vs RR IPL 2022) క్యాపిటల్స్ ను సునాయంగా గట్టెక్కించే ప్రయత్నం చేశారు మార్ష్, డేవిడ్ వార్నర్.
కేవలం 18.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 161న రన్స్ చేసి విక్టరీ నమోదు చేసింది. మిచెల్ మార్ష్ 62 బంతులు ఆడి 89 రన్స్ చేశాడు. ఇందులో 5 ఫోర్లు 7 సిక్సర్లు ఉన్నాయి.
డేవిడ్ వార్నర్ 41 బంతులు ఆడి 52 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. ఇందులో 5 ఫోర్లు ఒక సిక్సర్ ఉన్నారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 144 రన్స్ చేశారు.
Also Read : దంచి కొట్టిన మిచెల్ మార్ష్