Covaxin Corbevax : కోవాక్సిన్..కార్బెవాక్స్ కు లైన్ క్లియర్
6 నుంచి 12 ఏళ్లు కోవాక్సిన్ , 5 నుంచి 12 ఏళ్లు కార్బెవాక్స్
Covaxin Corbevax : కరోనా ఫోర్త్ వేవ్ మెల మెల్లగా పుంజుకుంటోంది. ఈసారి ఈ వేవ్ ప్రధానంగా చిన్నారులు, పాఠశాలల విద్యార్థుల మీద పడుతోంది. ఇప్పటికే ఢిల్లీలోని పలు పాఠశాలలో స్టూడెంట్స్ కు సోకడంతో ఢిల్లీ ఆప్ సర్కార్ అప్రమత్తమైంది.
ఈ తరుణంలో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ( డీసీజీఐ ) మంగళవారం కీలక ప్రకటన చేసింది. అదేమిటంటే పిల్లలు ప్రధానంగా 5 నుంచి 12 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ కు సంబంధించి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది.
ఇందులో భాగంగా భారత్ బయో టెక్ తయారు చేసిన కోవాక్సిన్ వ్యాక్సిన్(Covaxin Corbevax)cova ను 6 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలకు, కార్బె వాక్స్ వ్యాక్సిన్ ను 5 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలకు టీకాలు ఇచ్చేందుకు అనుమతి ఇచ్చినట్లు డీసీజీఐ వెల్లడించింది.
ఈ మేరకు మంగళవారం అధికారికంగా ప్రకటన చేసింది. అత్యవసర వినియోగం కింద వీటిని వాడవచ్చని స్పష్టం చేసింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సిఓ) , కోవిడ్ -19 సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ (ఎస్ఇసీ ) సిఫారసులను అనుసరించి తాము ఈ వ్యాక్సిన్లకు పర్మిషన్ ఇచ్చినట్లు వెల్లడించింది.
ఇదే సమయంలో మొదటి రెండు నెలలకు ప్రతి 15 రోజులకు తగిన విశ్లేషణతో , ప్రతికూల సంఘటనల డేటాతో సహా సమర్పించాలని డీసీజీఐ టీకా తయారీదారులను ఆదేశించింది.
భారత్ బయోటెక్ 5 నెలల వరకు డేటాను నెల వారీగా సమర్పంచాలని సూచించింది. 2021 డిసెంబర్ 24న 12 నుంచి 18 ఏళ్ల వయసు కలిగిన వారి కోసం డీసీజీఐ ద్వారా కోవాక్సిన్ కు యూజ్ లిస్టింగ్ మంజూరు చేసింది.
Also Read : ఉక్రెయిన్ వార్ ఐరోపాకు మేలుకొలుపు