DCW Chief : డబ్ల్యూఎఫఐ చీఫ్ ను అరెస్ట్ చేయండి
ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు మహిళా కమిషన్
DCW Chief : ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్(DCW Chief) నిప్పులు చెరిగారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళా రెజ్లర్ల పట్ల పోలీసులు అనుసరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి ప్రధాన కారకుడు భారత రెజ్లర్ల సమాఖ్య చీఫ్ , భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కారణమని ఆరోపించారు. వెంటనే సింగ్ ను అరెస్ట్ చేయాలని స్వాతి మలివాల్ ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు లేఖ రాశారు.
లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రోజు రోజుకు ఢిల్లీ పోలీసుల తీరు దారుణంగా తయారైందని మండిపడ్డారు. దేశ రాజధానిలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న జరిగిన సంఘటనను చూసి దేశం యావత్తు సిగ్గుతో తల దించుకుందన్నారు. మహిళా రెజ్లర్లను, వారి కుటుంబాలను ఢిల్లీ పోలీసులు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.
ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు ఇప్పటి వరకు నమోదు చేసిన రెండు కేసులు చాలవన్నారు. మొత్తం వ్యవహారానికి పూర్తి బాధ్యత వహిస్తూ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను వెంటనే చీఫ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయనను గుడ్డిగా వెనకేసుకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ , హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాను తీవ్రంగా తప్పు పట్టింది ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్.
Also Read : Simha Vahanam