DCW SBI : ఉమెన్ క‌మిష‌న్ దెబ్బ ఎస్బీఐ అబ్బా

జారీ చేసిన ఉత్త‌ర్వులు వెన‌క్కి

DCW SBI : చ‌ట్టం చాలా బ‌లీయ‌మైంది. ప్ర‌త్యేకించి మ‌హిళ‌ల విష‌యంలో వివ‌క్ష ఇంకా కొన‌సాగుతూనే ఉంది. త‌రాలు మారినా టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చినా వ్య‌క్తులే కాదు వ్య‌వ‌స్థ‌లు, సంస్థ‌లు, కంపెనీల‌లో మార్పులు ఇంకా రాక పోవ‌డం బాధాక‌రం.

ఇక విష‌యానికి వ‌స్తే భార‌త దేశంలో అతి పెద్ద ప్ర‌భుత్వ రంగ సంస్థ గా పేరు తెచ్చుకుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాDCW SBI). ఆ బ్యాంకులో ఎక్కువ మంది ఉన్న‌తాధికారులంతా పురుషులే ఉండ‌డం విశేషం.

ఇప్ప‌టికే స‌ర్వీసు విష‌యంలో నానా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న స‌ద‌రు బ్యాంకు నిర్వాకం వివాదాస్ప‌దంగా మారింది. దీంతో మ‌హిళ‌ల ప్ర‌త్యేకించి గ‌ర్భిణీల విష‌యంలో జారీ చేసిన స‌ర్క్యుల‌ర్ పై తీవ్ర రాద్దాంతం చెల‌రేగింది.

దీనిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు చెల‌రేగ‌డం, కేంద్ర ప్ర‌భుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్త‌డంతో జాతీయ మ‌హిళా క‌మిష‌న్(DCW SBI) దీనిపై సీరియ‌స్ అయ్యింది. గ‌ర్భిణీల ప‌ట్ల అమానుషంగా జారీ చేసిన ఉత్తర్వుల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని ఆదేశించింది.

లేక పోతే ఎస్బీఐ చైర్మ‌న్, సిఇఓ, ఎండీతో పాటు ఆ జారీ చేసిన వారంతా క‌మిష‌న్ ముందు హాజ‌రు కావాల‌ని హెచ్చ‌రించింది.

ఈ ఉత్త‌ర్వుల్లో ప్ర‌త్యేకించి ఎస్బీఐ మూడు నెల‌లు దాటిన గ‌ర్భీణీ అభ్య‌ర్థులు విధుల్లో చేరేందుకు అన‌ర్హులంటూ పేర్కొంది ఉత్త‌ర్వుల్లో. బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన నాలుగు నెలల లోపు చేరొచ్చంటూ పేర్కొన‌డాన్ని త‌ప్పు ప‌ట్టింది.

ఈ చ‌ర్య ప్రాథ‌మిక హ‌క్కుల్ని కాల‌రాసేదిగా ఉందంటూ ఎంపీ బినోయ్ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. తాను జారీ చేసిన స‌ర్క్యుల‌ర్ ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది ఎస్బీఐ.

Also Read : ‘మేఘా’ పంట పండింది

Leave A Reply

Your Email Id will not be published!