Roger Federer : స్టార్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన చిరకాల ప్రత్యర్థి స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను గెలుపొంది చరిత్ర సృష్టించాడు.
దీనిపై స్పందించాడు ఫెదరర్. ఆట పట్ల నీ అంకితభావం, నిబద్దత, నీవు సాధించిన విజయాలు నాకే కాదు ప్రపంచంలోని ప్రతి ఒక ఆటగాడికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తందని పేర్కొన్నాడు.
ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియన్ ఓపెన్ కిరీటాన్ని స్వంతం చేసుకున్నాక ఫెదరర్ ఈ కామెంట్ చేశాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు.
మేమిద్దరం ఎన్నో మ్యాచ్ లలో తలపడ్డాం. కానీ రాఫెల్ నాదల్ ఎప్పుడూ ఆట పట్ల ఉత్సుకత, అభిమానం, ప్రేమ కలిగి ఉండడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు.
ఇలాంటి ఆటగాళ్లు అరుదుగా ఉంటారని పేర్కొన్నాడు. తన ప్రత్యర్థి ఆటగాడిని ప్రశంసించేందుకు వెనుకాడ లేదు ఫెదరర్(Roger Federer). మైదానంలో మాత్రమే మేము ప్రత్యర్థులం. ఆ తర్వాత విడదీయలేని స్నేహితులమని స్పష్టం చేశాడు.
ఆసిస్ ఓపెన్ టైటిల్ ను వరుస 5 సెట్లతో రష్యాకు చెందిన మరో స్టార్ ప్లేయర్ డేనియల్ మెద్వెదేవ్ ను ఓడించాడు. ఇక నాదల్ ఈ విజయంతో అత్యధిక పురుషుల సింగిల్స్ మేజర్ల జాబితాలో రోజర్ ఫెదరర్(Roger Federer),
నోవాక్ జొకోవిచ్ లను అధిగమించాడు. సింగిల్స్ లో 20 కంటే ఎక్కువ గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న మొట్ట మొదటి పురుష ప్లేయర్ గా చరిత్ర లిఖించాడు రాఫెల్ నాదల్.
Also Read : చరిత్ర సృష్టించిన రాఫెల్ నాదల్