Dear Justice Comment : డియర్ జస్టిస్ న్యాయానికి దిక్కేది
నోరు మెదపని న్యాయమూర్తులు, ఆఫీసర్లు
Dear Justice Comment : న్యాయం అన్నది అందరికీ సమానంగా ఉండాలి. తీర్పు ఇచ్చే వాళ్లు అత్యంత నిబద్దతతో వ్యవహరించాలి. తాజాగా దేశంలోని ప్రముఖులు, మాజీ న్యాయూమర్తులు, మాజీ ఉన్నతాధికారులు, మాజీ సైనిక అధికారులు పెద్ద ఎత్తున తమకు దేశం పట్ల గౌరవం ఉందనే భావనతో బయటకు వచ్చారు. వాళ్లు సనాతన ధర్మం పట్ల వకల్తా పుచ్చుకున్నారు. తామే ధర్మానికి ప్రతినిధులం అయినట్లుగా ఓ సంచలన ప్రకటన కూడా చేశారు. ఈ దేశంలో హిందువులే కాదు ముస్లింలు, మైనార్టీలు, బౌద్దులు, అనేక రకాలైన వారంతా బతుకుతున్నారు. ఇవాళ దేశ జనాభా 140 కోట్లకు చేరుకుంది. ఇదంతా పక్కన పెడితే మరోసారి చర్చనీయాంశంగా మారింది సనాతన ధర్మం.
Dear Justice Comment Viral
ఇవాళ కోడై కూస్తున్న వాళ్లు, సీజేఐకి లేఖ రాసిన వాళ్లు సభ్య సమాజం తల దించుకునేలా దారుణమైన ఘటనలు ఈ దేశంలో చోటు చేసుకుంటే ఒక్కనాడైనా స్పందించిన దాఖాలాలు లేవు. బిల్కిస్ బానోను సామూహిక అత్యాచారానికి పాల్పడిన వాళ్లు బయటకు వచ్చినప్పుడు ప్రశ్నించ లేదు. కానీ ఒక్క సనాతన ధర్మం పై తమిళనాడుకు చెందిన మంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నించే సరికి మొత్తం బయటకు వచ్చారు. తమ గొంతు వినిపించారు. భారత దేశ సర్వోతన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్(Justice Chandrachud) కు సుదీర్ఘ లేఖ రాశారు. న్యాయం అందరికీ సమానమని రాజ్యాంగంలో పొందు పర్చారు. కానీ ప్రతి చోటా అన్యాయమే రాజ్యమేలుతోంది.
న్యాయం ఉన్నోళ్లకు, బడా బాబులకు చుట్టంగా మారిందన్న ఆరోపణలు లేక పోలేదు. ఇదంతా పక్కన పెడితే ఏ ధర్మం బోధించింది. ఇతరులను హింసించమని, దారుణంగా దాడులకు తెగబడమని, అత్యాచారాలకు పాల్పడమని. నా దేశంలో దేనినైనా భరిస్తాను కానీ కులాన్ని, మతాన్ని మాత్రం సహించ లేనంటూ వాపోయాడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. కులపు నిచ్చెన మెట్ల మీద బతుకుతూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ మనుషులపై దాడులకు తెగబడుతున్న వారిని ఎందుకు నిలదీయడం లేదనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలి పోయింది. ఇక్కడ పుట్టిన ప్రతి వ్యక్తి భారతీయుడే. మనమంతా భారతీయులం అని ఎందుకు చెప్పలేక పోతున్నామని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. డియర్ జస్టిస్ ఎవరి పట్ల చర్యలు తీసుకుంటారో మీరైనా సెలవిస్తే ఈ దేశం మీకు సలాం చేస్తుంది.
సనాతన ధర్మం ప్రమాదంలో పడిందంటూ ఆందోళన వ్యక్తం చేసిన వారంతా ఎందుకని మణిపూర్ లో ఇన్ని దారుణాలు చోటు చేసుకున్నా ఎందుకు నోరు మెదపలేక పోయారు. ఎందుకు సీజేఐకి లేఖ రాయలేక పోయారో కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. తలకు వెల కట్టిన సాధువు హీరోగా మారి పోతే ఇక న్యాయం ఉన్నట్టా లేనట్టా.
Also Read : RS Praveen Kumar : హోం గార్డులు ఆత్మహత్యలు చేసుకోవద్దు