Deepa Das Munsi : ఠాక్రేకు షాక్ దీపాకు ఛాన్స్
దీపా దాస్ మున్సికి తెలంగాణ బాధ్యతలు
Deepa Das Munsi : న్యూఢిల్లీ – ఏఐసీసీ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించిన మహారాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్ , ప్రస్తుత ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న మాణిక్ రావు ఠాక్రేను తొలగించింది. ఆయన ఇప్పటి దాకా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గా ఉన్నారు.
Deepa Das Munsi New Position
ఇదే సమయంలో ఠాక్రే స్థానంలో మరో సీనియర్ నాయకురాలు దీపా దాస్ మున్సిని నియమించింది. మరో వైపు ఏపీ రాష్ట్రంలో శాసన సభతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ పూర్తిగా ఏపీలో కూడా సత్తా చాటేందుకు ప్రయత్నం చేయాలని మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇటీవలే వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.
ఇక తాజాగా నియమితులైన దీపా దాస్ మున్సి గతంలో కేంద్ర మంత్రివర్గంలో పని చేశారు. ఎంపీగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా పని చేశారు దీపా దాస్ మున్సీ(Deepa Das Munsi). స్వస్థలం కోల్ కతా . ఆమెకు ప్రస్తుతం 63 ఏళ్లు. 2012 నుండి 2014 వరకు కేంద్ర పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. రాయ్ గంజ్ నుండి 15వ లోక్ సభకు ఎంపీగా ఎన్నికయ్యారు.
Also Read : Bandla Ganesh : పవర్ లేనోళ్లకు ప్రెజెంటేషన్స్ ఎందుకు