Deepak Chahar : ప్రయోగాలకు వేదిక కాదని మరోసారి తేలి పోయింది భారత జట్టు సఫారీ టూర్. అత్యంత పేలవమైన ప్రదర్శనతో టీమిండియా విమర్శలు మూట గట్టుకుంది. నాయకత్వ లేమి అన్నది కనిపించింది.
కేఎల్ రాహుల్ నిర్వాకం కారణంగానే భారత జట్టు చేతులెత్తేసిందని భారత జట్టు మాజీ కెప్టెన్, కామెంటేటర్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇక ముచ్చటగా మూడో వన్డేలో సైతం భారత జట్టు చేతులెత్తేసింది.
నిర్ణీత ఓవర్లలో ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసినా ఆ జట్టు మన జట్టును కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యింది. కానీ మనోళ్లు ఏ కోశాన ఎదుర్కోలేక చేజేతులారా ఓటమి పాలయ్యారు.
చివరి దాకా ఉత్కంఠ భరితంగా సాగిన మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా గెలుపు అంచుల దాకా వచ్చింది. 288 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆదిలోనే దెబ్బ తగిలింది.
ఓపెనర్ కేఎల్ రాహుల్ వికెట్ పోగొట్టుకుంది. ఆ సమయంలో ఓపెనర్ శిఖర్ ధావన్ తో పాటు విరాట్ కోహ్లీ రాణించారు. ఆ తర్వాత సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మిడిల్ ఆర్డర్ సఫారీ బౌలర్లను ఎదుర్కోలేక పోయింది.
ఆఖరులో అనుకోకుండా వచ్చిన దీపక్ చాహర్ (Deepak Chahar )దుమ్ము రేపాడు. దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. 34 బంతులు ఎదుర్కొని 54 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు 2 భారీ సిక్సర్లు ఉన్నాయి.
చివరన ఎంగిడి రావడంతో అద్భుతమైన స్పెల్ కు అవుటయ్యాడు చాహర్. దీంతో భారత్ ఓటమి ఖాయమని తేలి పోయింది. మొత్తంగా దీపక్ చాహర్ తన సత్తా ఏమిటో చూపించాడు.
Also Read : రాణిస్తే ఓకే లేదంటే చోటు కష్టం