Deepika Ranveer Divorce : దీపికా ర‌ణ్ వీర్ బంధం తెగిందా..?

విడాకులకు రెడీ అయిన‌ట్లు పుకార్లు

Deepika Ranveer Divorce : బాలీవుడ్ లో మ‌రో జంట విడిపోతున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌ముఖ న‌టుడు ర‌ణ్ వీర్ సింగ్ , బాలీవుడ్ క్వీన్ దీపికా ప‌దుకొనే ఇద్ద‌రూ 2018లో పెళ్లి చేసుకున్నారు. వారిద్దూ బెస్ట్ పెయిర్ గా కూడా పేరు పొందారు. ఇద్ద‌రూ క‌లిసి సినిమాల‌లో న‌టించారు. ఇక దీపికా ప‌దుకొనే గెహ‌రియాన్ సినిమాలో రెచ్చి పోయి న‌టించింది. ఇదే స‌మ‌యంలో బాద్ షా షారుఖ్ ఖాన్ తో క‌లిసి ప‌ఠాన్ లో బికినీతో పాట‌లో న‌టించింది. ఆ పాట‌పై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది.

చివ‌ర‌కు ఆ చిత్రం ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ టాక్ తెచ్చుకుంది. ఏకంగా రూ. 1,000 కోట్ల మార్క్ ను దాటేసింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ క‌లెక్ష‌న్స్ కొల్ల‌గొట్టింది. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి ర‌ణ్ వీర్ సింగ్ , దీపికా ప‌దుకొనే విడి పోతున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందుకు సంబంధించి ప్ర‌ముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు(Umair Sandhu) కూడా ట్విట్ట‌ర్ లో పోస్ట్ కూడా చేయ‌డం ఇందుకు మ‌రింత బలం చేకూరుస్తోంది.

ఇద్ద‌రూ ఒక‌రిపై మ‌రొక‌రు పుట్టిన రోజు గ్రీటింగ్స్ కూడా చెప్పుకున్నారు. కానీ ఈ విష‌యంపై ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు. మ‌రో వైపు దారాల కంటే ప‌లుచ‌నైన బంధాలు సినీ రంగంలో న‌టిస్తున్న వారివి. ఎవ‌రు ఎప్పుడు విడిపోతారో చెప్ప‌లేని ప‌రిస్థితి. మొత్తంగా వీరు క‌లిసే ఉన్నారా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాలి.

Also Read : S Jai Shankar : ఆర్థిక స‌హ‌కారం అభివృద్ధికి సోపానం

Leave A Reply

Your Email Id will not be published!