Rohit Sharma : బౌలింగ్ వైఫల్యం వల్లే పరాజయం
మరింత మెరుగు పడాలన్న రోహిత్
Rohit Sharma : బౌలింగ్ వైఫల్యం వల్లనే తాము ఓడి పోయామని స్పష్టం చేశాడు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) . రెండో వన్డే మ్యాచ్ లో 5 పరుగుల తేడాతో పరాజయం పాలైంది టీమిండియా. మ్యాచ్ అనంతరం స్కిప్పర్ మీడియాతో మాట్లాడాడు. ప్రధానంగా బంగ్లాదేశ్ బ్యాటర్టు మెహదీ హసన్ మిరాజ్ , మహ్మదుల్లా ఊహించని రీతిలో ఆడారని పేర్కొన్నాడు.
మొదటి మ్యాచ్ లో చేతిలోకి వచ్చిన మ్యాచ్ ను మిరాజ్ వల్ల కోల్పోయామన్నాడు. ఇదే సమయంలో రెండో వన్డేలో గెలుపు అంచుల దాకా వచ్చినా ఓటమి పలకరించిందన్నాడు రోహిత్ శర్మ. మిరాజ్, మహ్మదుల్లా ఇద్దరూ కలిసి 148 రన్స్ భాగస్వామ్యం తమ కొంప ముంచిందన్నాడు.
అయితే ఓటమిని బౌలర్లపైకి నెట్టేసిన రోహిత్ శర్మ(Rohit Sharma) ధావన్ , కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు సైతం ఎందుకు ఆడలేదనే విషయాన్ని పక్కన పెట్టాడు. విచిత్రం ఏమిటంటే వన్డేలో అద్భుతంగా రాణించిన సంజూ శాంసన్ ను తీసుకోక పోవడం దారుణం. అసలు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఏం చేస్తున్నాడనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఆ ఇద్దరిని గనుక త్వరితగిన ఔట్ చేసి ఉంటే తాము మ్యాచ్ గెలిచి ఉండే వాళ్లమన్నాడు హిట్ మ్యాన్. ఇదిలా ఉండగా 2005 శ్రీలంకలో నమోదైన మహేళ జయవర్దనే, ఉపుల్ చందనా కలిసి నెలకొల్పిన రికార్డును మిరాజ్ , మహ్మదుల్లా బద్దలు కొట్టారు. విచిత్రం ఏమిటంటే 83 బంతులు ఆడిన మిరాజ్ 4 సిక్సర్లు, 8 ఫోర్లు సాధించాడు.
కాగా మొదటి సెషన్ లో రాణించిన బౌలర్లు డెత్ సెషన్ లో రాణించలేక పోతున్నారని వాపోయాడు .
Also Read : భారత్ పరాజయం బీసీసీఐపై ఆగ్రహం