Russian Helicopter Gunship : ఉక్రెయిన్ పై ఏకపక్ష దాడులకు తెగబడుతున్న రష్యాకు కోలుకోలేని షాక్ తగిలింది. ఊహించని రీతిలో తాత్కాలిక విరామం ప్రకటించిన రష్యా మరోసారి అటాకింగ్ కు పాల్పడింది.
దీంతో మరోసారి యుద్దం అనివార్యమైంది. ఇదిలా ఉండగా దాడులకు పాల్పడుతూ రెచ్చి పోతున్న రష్యాకు దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చామని ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రకటించింది.
తమ దేశానికి చెందిన వైమానిక దళ నిపుణులు రష్యా కు చెందిన హెలికాప్టర్ ను కూల్చి (Russian Helicopter Gunship )వేశామని వెల్లడించింది. ఈ ఘటన చెర్నిహివ్ నగర శివారులో చోటు చేసుకుందని ఫుల్ క్లారిటీ ఇచ్చింది.
అయితే రష్యా హెలికాప్టర్ కూల్చి వేసిన ఘటనలో ఆ దేశానికి చెందిన ఒక పైలట్ మరణించాడని స్పష్టం చేసింది. అతడిని మేజర్ క్రివోలాపోవ్ గా గుర్తించినట్లు ప్రకటించింది ఉక్రెయిన్ రక్షణ శాఖ.
మరో పైలట్ క్రస్నోయర్ సెవ్ ను అదుపులోకి తీసుకున్నామని డిక్లేర్ చేసింది. ఇందుకు సంబంధించి ఉక్రెయిన్ ఏకంగా వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసింది. మరో వైపు రష్యా దాడులు మాత్రం ఆపడం లేదు.
ఓ వైపు దాడులకు పాల్పడుతూనే ఇంకో వైపు చర్చలకు సిద్దం అంటూ ప్రకటిస్తోంది. రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్న రష్యాను యావత్ ప్రపంచం ఈసడించుకుంటోంది. ద్వేషిస్తోంది.
రష్యా చీఫ్ పుతిన్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరుతున్నాయి ఆయా దేశాలు. ఓ వైపు అమెరికా కన్నెర్ర చేసినా డోంట్ కేర్ అంటూ యుద్దం వైపు మొగ్గు చూపుతున్నారు.
Also Read : 11 వేల మంది రష్యన్ సైనికులు ఖతం